విజయ్ దేవరకొండ – హరీష్ శంకర్ కాంబో సెట్ అయ్యేనా..?

0
10

‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకి తన క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పెంచుకుంటూ పోతున్న VD.. ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటాలని యువ హీరో గట్టిగానే ఫిక్స్ అయ్యాడు.

దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమాని ప్రారంభిస్తాడు. అలానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో విజయ్ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ అప్పట్లో ఓ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడట. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న హరీష్.. విజయ్ కోసం కథ రెడీ చేస్తే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే అదే సమయంలో ఈ కాంబో కుదరకపోవచ్చని అనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం గతంలో హరీష్ ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడిన మాటలే అంటున్నారు. హరీష్ మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు మెసేజ్ పెట్టానని.. ‘రెండేళ్ల దాకా బిజీగా ఉన్నాను అన్నా. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం’ అన్నట్లుగా రిప్లై ఇచ్చాడని.. ‘సినిమా టాపిక్ కాకుండా నీకు నాకు పనేమీ ఉంటది భయ్యా. ఒకటిన్నర ఏళ్ల తర్వాతే కలుద్దాంలే’ అని మెసేజ్ చేశానని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే విజయ్ – హరీష్ కాంబో సెట్ కాకపోవచ్చని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here