వర్మ ‘పవర్ స్టార్’ వివాదంలోకి ఎన్టీఆర్‌.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. నిర్మాతపై ఫ్యాన్స్ ఫైర్

0
52

రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వివాదాలు సృష్టిస్తుంటాడు. లేదా వేరే ఎవరైనా తనపై కామెంట్స్ చేసే పనులను చేస్తాడు. పవర్ స్టార్ విషయంలో వర్మ చేసింది కూడా అదే. వర్మ పవన్ కళ్యాణ్‌పైనే సెటైరికల్ సినిమా తీస్తూనే కాదని బుకాయిస్తూ వచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. సరాసరా వర్మ ఆఫీస్‌కు వెళ్లి బీభత్సం చేశారు. కావాలంటే అడ్రస్ గూగుల్‌లో ఉంటుంది చూసుకోండని సవాల్ చేసిన వర్మకు చుక్కలు చూపించారు. అయితే దాన్ని కూడా సెన్సేషన్ చేస్తూ తనకు అనుకూలంగానే మార్చుకున్నాడు వర్మ.

నిఖిల్ కామెంట్స్..
కుక్క మొరిగితే శిఖరం తల తిప్పి చూడదని ఏదో వర్మకు సెటైర్ వేద్దామని ప్రయత్నించాడు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే వర్మ మాత్రం నిఖిల్‌ను దారుణంగా అవమానించాడు. నిఖిలా? కికిలా? ఎవడో నాకు తెలీదు.. వారంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తుల్లాంటి వారని ఏకిపారేశాడు.

ఓ నిర్మాత సైతం..
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ వర్మపై పరోక్షంగా పంచ్‌లు వేశాడు. ఇందుకోసం ఎన్టీఆర్‌ను వాడేశాడు. ప్రతీ ఒక్కరికీ సెన్సేషన్ క్రియేట్ చేయడం అలవాటైపోయిందని ఫైర్ అయ్యాడు. వారి బతుకు కోసం పక్క వారి బతుకు మీద పడే రాబందులు ప్రతీ చోటా ఉన్నాయని, వాటికి ఎలాంటి సిగ్గు ఉండదని ఫైర్ అయ్యాడు. అలాంటి వారిని ద్వేషించడం కంటే పట్టించుకోకపోవడమే బెటర్ అని ఎన్టీఆర్ డైలాగ్‌ను కౌంటర్‌గా వేశాడు.

కొండను చూసి కుక్క మొరిగితే..
అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్‌ను నాగ వంశీ వాడేశాడు. కొండను చూసి కుక్కు మొరిగితే కొండకు చేటా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో పవర్‌పుల్‌గా చెప్పిన డైలాగ్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాడు. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదు…
పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఇలా ఎన్టీఆర్ డైలాగ్‌ను వాడటంపై నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ టైంలో ఎందుకు స్పందించలేదని నిర్మాతపై ఫైర్ అవుతున్నారు. కావాలంటే ఎన్టీఆర్ డైలాగ్‌ను తీసేసి మద్దతు ఇచ్చుకోండని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here