వకీల్ సాబ్ మిడ్ నైట్ షో వద్దనుకుంటున్న దిల్ రాజు!!

0
16

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలకు సర్వం సిద్దం. బాలీవుడ్ పింక్ మూవీ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ పవన్ అభిమానులకు ఉగాదిని కొన్ని రోజుల ముందే తీసుకు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పవన్ ను వెండి తెరపై చూసి మూడు సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఆయన అభిమానుల ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.

ఇన్నాళ్లు వెయిట్ చేసిన అభిమానులు సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఉవ్విల్లూరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మిడ్ నైట్ షో ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. కాని చిత్ర యూనిట్ సభ్యులు మిడ్ నైట్ షో లు వేసేందుకు ఆసక్తిగా లేరంటూ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. దిల్ రాజు ముందస్తుగా ఆలోచించి మిడ్ నైట్ షో ల ప్రదర్శణ కోసం ప్రభుత్వ అనుమతికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం లేదట.

ప్రస్తుతం దిల్ రాజు బెనిఫిట్ షో లకు సంబంధించిన అనుమతుల కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద లాబీయింగ్ చేస్తున్నాడని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బెనిఫిట్ షో లకు అనుమతులు రాకుంటే మొదటి వారం లేదా మూడు రోజులు అదనంగా మరో షో ను ప్రదర్శించేందుకు అనుమతులు అడుగుతున్నాడట. విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది కనుక చకచక పనులు చక్కబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక జనరల్ షో లకు సంబంధించిన టికెట్లు కూడా హాట్ కేక్స్ మాదిరిగా అమ్ము పోయాయి. హైదరాబాద్ లో మొదటి రోజు 215 షో లు వేయబోతున్నారు. ఇప్పటికే 98 శాతం వరకు షో లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక శని ఆదివారం షో లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా 80 శాతంకు పైగా పూర్తి అయ్యిందంటున్నారు. ఈ బుకింగ్ జోరు చూస్తుంటే ఓపెనింగ్ విషయంలో రికార్డు నమోదు చేయడం ఖాయమేమో అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here