‘వకీల్ సాబ్’ ను పట్టించుకోని స్టార్ హీరోయిన్..!

0
10

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలి – నివేదా థామస్ – అనన్య కీలక పాత్రలు పోషించారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. మెయిన్ పాయింట్ పక్కదోవ పట్టకుండా సాంగ్స్-ఫైట్స్ వంటివి జత చేశారు. అలానే పవన్ కు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్నారు. అయితే మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఇంతవరకు శృతి హాసన్ ప్రమోషన్స్ పాల్గొనలేదు.

‘వకీల్ సాబ్’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ – శృతి హాసన్ మధ్య లవ్ ట్రాక్ – ‘కంటి పాపా’ సాంగ్ వంటివి ఉన్నాయి. అయితే ట్రైలర్ లో శ్రుతికి సంబంధించిన చిన్న షాట్ కూడా చూపించకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. దీనిని బట్టే ఇందులో ఆమె పాత్ర కీలకమనే విషయం అర్థం అవుతుంది. అంతేకాక శ్రుతి హసన్ ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తుందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆమెది చిన్న పాత్ర అయినా కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఈ మధ్య అంజలి – నివేదా థామస్ – అనన్య ముగ్గురూ ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ శృతి ఎక్కడా కనిపించలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆమె హాజరు కాలేదు.

ఇకపోతే ‘వకీల్ సాబ్’ ఈవెంట్ లో అందరి గురించి ప్రస్తావించి పవన్ కళ్యాణ్.. శృతి హాసన్ పేరు విస్మరించారు. మిగతా చిత్ర యూనిట్ కూడా ఆమె గురించి మాట్లాడకపోవడం గమనార్హం. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు ఉంది కాబట్టి ఆమెతో స్పెషల్ గా ఏదైనా ఇంటర్వ్యూ ప్లాన్ చేసారేమో చూడాలి. పవన్ – శృతి హాసన్ ఇంతకముందు ‘గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలలో నటించింది. ‘వకీల్ సాబ్’ తో ఈ జోడీ మరోసారి హిట్ పెయిర్ అనిపించుకుంటుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here