‘వకీల్ సాబ్’ ఐటెం సాంగ్ పై థమన్ స్పందన

0
16

పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు ముస్తాభయ్యింది. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుక కూడా వైభవంగా నిర్వహించారు. సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటంతో చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఓపెనింగ్స్ ను ఆశిస్తున్నారు. ఇక గత రెండు వారాలుగా చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు సంగీత దర్శకుడు థమన్ లు సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ను నిర్వహిస్తూ చిత్రాన్ని మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కోసం మొదటి సారి థమన్ సంగీతాన్ని అందించాడు. దాంతో గతంలో ఎప్పుడు లేని విధంగా వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ లో థమన్ పాల్గొంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో థమన్ మరిన్ని విషయాలను మాట్లాడాడు.

థమన్ ఆ ఇంటర్వ్యూలో… వకీల్ సాబ్ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై వోల్టేజ్ సన్నివేశంను పవన్ అభిమానులు చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. మొదట ఈ సినిమాకు ‘మగువ మగువ’ అనే టైటిల్ ను అనుకున్నా చివరకు వకీల్ సాబ్ ను ఖరారు చేసినట్లుగా పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా లో ఐటెం సాంగ్ ఉండాలంటూ కొందరు అభిమానులు నన్ను సోషల్ మీడియా ద్వారా కోరడం జరిగింది. వారు ఈ సినిమా లో ఐటెం సాంగ్ ను ఎలా అడిగారో నాకు అర్థం అవ్వలేదు. వకీల్ సాబ్ కు ఐటెం సాంగ్ అడిగిన సమయంలో నాకు ఆశ్చర్యం వేసిందని థమన్ అన్నాడు.

ఇటీవల కాలంలో థమన్ టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేస్తున్నాడు. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. పవన్ తో మరో సినిమాకు వర్క్ చేస్తున్న థమన్ మరో వైపు మహేష్ బాబు సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవి చేయబోతున్న సినిమాకు కూడా థమన్ కు ఛాన్స్ దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా తో పాటు పాటల ఆల్బం కూడా సెన్షేషనల్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ లో థమన్ టాప్ సంగీత దర్శకుడు అనడంలో సందేహం లేదు అంటూ ఆయన అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here