వంటలక్క-సుమక్క కలిసింది అందుకే.. ఇక ఎన్ని విషయాలు బయటకు వస్తాయో?

0
4

రెండ్రోజుల క్రితం సుమక్క-వంటలక్క కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇలా ఇద్దరూ మలయాళీలు ఒకే చోట కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. దానికి తోడు సుమ వేసిన పజిల్ నెటిజన్లలో ఇంకొన్ని అనుమానాలు రేకెత్తించింది. ఇద్దరం ఎందుకు కలిశామో గెస్ చేస్తూనే ఉండండి అంటూ ఆసక్తిని పెంచేసి వెళ్లిపోయింది. ఇక ఆ పోస్ట్‌పై నెటిజన్లు చేసిన రకరకాల కామెంట్లతో వంటలక్క సుమక్క సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ అయ్యారు.

ఇద్దరూ ఇద్దరే..

వంటలక్కకు ఉన్న క్రేజ్, సుమక్కకు ఉన్న క్రేజ్‌ను పోల్చలేం. ఇద్దరూ ఇద్దరూ. ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. ఎక్కడో కేరళలో పుట్టి తెలుగింటి మహిళల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. అయితే ఒకరిది దశాబ్దానికి పైగా కష్టం.. ఇంకొకరి ఒకే ఒక్క సీరియల్‌తో వచ్చిన పాపులార్టీ.

బుల్లితెరపై సంచలనాలే..

యాంకరింగ్‌ రంగంలో మకుటం లేని మహారాణిగా తిరుగులేని స్టార్డంతో దూసుకుపోతోంది సుమ. స్టార్ మహిళతో ఏకంగా లిమ్కా బుక్‌లోకి ఎక్కేసింది. తన కట్టూబొట్టూ వేషాదారణతో తెలుగు మహిళలకు ప్రతినిధి, ఆత్మగౌరవానికి ప్రతీకగా వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ జీవిస్తోంది.

అలా కలిశారు..

తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అయింది. సుమ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎందుకు కలిశామో ఏం జరుగుతుందో కీప్ గెస్సింగ్ అంటూ ఓ పోస్ట్ చేసింది. ఎంతకీ ఆ గుట్టేంటో ఎవ్వరూ కనిపెట్టకపోయే సరికి సుమ రివీల్ చేసింది.

స్పెషల్ ఇంటర్వ్యూ..

దసరా పండుగ కోసం వంటలక్కను సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. అసలే వంటలక్క బయటి ఈవెంట్లకు ఎక్కడికీ రాదు. ఇంటర్వ్యూలు అసలే ఇవ్వదు. కానీ మొదటి సారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా న్యూస్ చానెల్‌కు. అందులోనూ సుమ యాంకర్ అంటేనే ఇచ్చినట్టుంది.

మనం మలయాళీలం కదా..

నీ వల్ల బయట గొడవలు అవుతున్నాయి.. భార్యలేమో కార్తీకదీపం అంటున్నారు.. భర్తలేమో ఐపీల్ అంటున్నారు.. అని సుమ ప్రశ్నించింది. భార్య మాటలే వినాలని ప్రేమీ విశ్వనాథ్ ఆన్సర్ ఇచ్చింది. ఇంత వరకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని సుమ అడిగితే.. సరైన టైం రాలేదు.. సరైన వేదిక, యాంకర్ దొరకలేదు.. మనం మలయాళీలం కదా అంటూ సుమకు బిస్కెట్ వేసింది. ఇక వీరి ఇంటర్వ్యూలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here