లైగర్ బ్యూటీ కిల్లర్ భంగిమకు మైండ్ బ్లాక్

0
16

లైగర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది బాలీవుడ్ యువనాయిక అనన్యపాండే. నేటితరం నాయికల్లో స్టైలిష్ అండ్ స్టన్నింగ్ గాళ్ గా వెలిగిపోతున్న ఈ ఫ్యాషనిష్టా ఎంపికలు యువతరంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజాగా అనన్య షేర్ చేసిన బ్లూ అండ్ బ్లూ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అలా సింపుల్ గా సోఫాలో వాలిపోయిన అనన్య పొడవాటి కాళ్ల సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ.. బ్లూ థై స్లిట్ లెహెంగాలో కనిపించింది. అనన్య కిల్లర్ ఫోజ్ కి యూత్ పరేషాన్ అవుతున్నారు. ప్రస్తుతం బోయ్స్ లో ఈ ఫోటో వైరల్ గా మారింది.

అనన్య పాండే ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన అమ్మమ్మ స్నేహలతా పాండేతో ఉన్న  త్రోబాక్ ఫోటోని షేర్ చేసింది. బాల్యంలో అనన్య తన దాదీతో పాటు టేబుల్ మీద కూర్చొని కొంటెగా చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తోంది. ఒక ఫోటోలో దాదీని ముద్దాడుతూ కనిపించింది. ఇంతలోనే హాటెస్ట్ ఫోటోషూట్ తో దూసుకొచ్చిందిలా.

కొనసాగుతున్న COVID 19 సెకండ్ వేవ్ కారణంగా లైగర్ టీజర్ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనన్య పాండే ఈ నిర్ణయంతో తీవ్రంగా నిరాశపడిందట. కానీ టీమ్ నిర్ణయాన్ని సదా గౌరవిస్తోంది. తదుపరి పలు భారీ బాలీవుడ్ చిత్రాల్లో నటించాల్సి ఉండగా అవన్నీ కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here