లేడీ సూపర్ స్టార్స్ క్రేజీ మూవీ పై క్లారిటీ

0
14

తమిళంలో స్టార్ హీరోయిన్స్.. లేడీ సూపర్ స్టార్స్ అయిన నయనతార మరియు సమంతలు కలిసి నటించబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో ఈ ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్న సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకుడు. ప్రియుడి దర్శకత్వంలో నయనతార ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కాని సెకండ్ వేవ్ కారణంగా నెల రోజుల షూట్ తర్వాత సినిమా నిలిచి పోయింది.

ఇటీవల తమిళ మీడియాలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను పక్కకు పెట్టేశాడని.. స్క్రిప్ట్ విషయంలో విజయ్ సేతుపతి కూడా అనుమానాలు వ్యక్తం చేయడం వల్ల ప్రాజెక్ట్ సేఫ్ కాదనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారనే వార్తలు వచ్చాయి. తమిళ మీడియాలో వచ్చిన వార్తలతో నయనతార మరియు విజయ్ సేతుపతి ఇంకా సమంత అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి క్రేజీ కాంబోలో సినిమా వస్తుందని ఆశ పడితే ఇలా అయ్యిందేంటి అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమయంలో మేకర్స్ నుండి క్లారిటీ వచ్చింది.

మీడియాలో వస్తున్నట్లుగా సినిమా క్యాన్సిల్ అవ్వలేదు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత అందరికి డేట్లు కుదిరిన వెంటనే సినిమాను మళ్లీ ప్రారంభిస్తామని వారు చెబుతున్నారు. ఈ క్రేజీ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ సమాచారం అందుతోంది. అయితే ఎవరిని ఎవరు ప్రేమిస్తారు.. క్లైమాక్స్ ఏమవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here