లెస్బియన్స్ గా రెచ్చిపోయిన ఆర్జీవీ బ్యూటీస్..!

0
18

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ”డేంజరస్”. ఇందులో అప్సర రాణి – నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన హై ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని ఇప్పటికే వర్మ ప్రకటించారు. లాక్ డౌన్ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆర్జీవీ.. ‘స్పార్క్’ ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సంచలనం రేపిన వర్మ.. తాజాగా ‘డేంజరస్’ ట్రైలర్ ని వదిలాడు.

ట్రైలర్ ప్రారంభమయ్యే ముందు.. ‘సెక్షన్ 377 ను భారత సుప్రీంకోర్టు రద్దు చేసిందని అందరు మోరలిస్ట్ లకు గుర్తు చేస్తున్నాను’ అని ఆర్జీవీ డిస్క్లైమెర్ వేశాడు. పురుషులను ద్వేషించే ఇద్దరు అమ్మాయిలు నైనా గంగూలీ – అప్సర రాణి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇందులో నైనా – అప్సర ఇద్దరూ బికినీలు ధరించి కావల్సినంత స్కిన్ షో చేశారు. అలానే లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించారు.

లెస్బియన్ లవ్ స్టొరీలో ఓ క్రైమ్ ని లింక్ చేసి చూపించారు. ఇద్దరూ డబ్బు తీసుకొని పారిపోతుండగా.. కొందరు గ్యాంగ్ స్టర్స్ వాళ్ళని వెంబడిస్తున్నారు. ఈ లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా.. ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని వర్మ ఈ సినిమాలో చెప్పబోతున్నాడని తెలుస్తోంది. ఇది ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని పేర్కొన్నారు.

”డేంజరస్” చిత్రంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అంతం’ సినిమాలోని ‘నీ నవ్వు చెప్పింది నాతో..’ అనే సూపర్ హిట్ సాంగ్ ని రీమేక్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి వర్మ చేస్తున్న ఈ డేంజరస్ ప్రయత్నం ప్రేక్షకులకు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ‘స్పార్క్’ ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here