‘లవర్ బాయ్’ లుక్కుతోనే ప్రభాస్.. రికార్డులు సెట్ చేస్తున్నాడా..??

0
32

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో గ్యాప్ లేకుండా బిజీ అయిపోయాడు. అయితే అన్నిటికంటే ముందుగా ప్రభాస్ నుండి రాధేశ్యామ్ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా సినిమా రూపొందిన రాధేశ్యామ్ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కి డార్లింగ్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. దాదాపు గతేడాది కాలంగా రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది కాస్తా వీలుపడేలా లేదు. అయితే ప్రభాస్ సినిమాలు బాహుబలి సిరీస్ తర్వాత అన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. అయితే ఇంతవరకు రాధేశ్యామ్ నుండి సాంగ్స్ లేదా టీజర్ ఏది రాలేదు.

కానీ మోషన్ పోస్టర్స్.. ఫస్ట్ గ్లింప్స్ మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిని ఓ రేంజిలో రిసీవ్ చేసుకున్నారు ఫ్యాన్స్. అలాగే అందరూ హీరోలు టీజర్స్ ట్రైలర్స్ తో రికార్డులు బ్రేక్ చేస్తుంటే.. డార్లింగ్ కేవలం మోషన్ పోస్టర్ – గ్లింప్స్ తోనే రికార్డు క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగంటే.. రాధేశ్యామ్ మూవీ మోషన్ పోస్టర్ ఇప్పటివరకు ఇరవై మిలియన్స్ వ్యూస్ తో పాటు హాఫ్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమా కూడా ఈ ఫీట్ సాధించలేదని సినీ వర్గాలలో టాక్. అయితే ప్రభాస్ లవర్ బాయ్ పాత్రలో కనిపించి చాలాకాలం అయింది. అప్పుడెప్పుడో డార్లింగ్ – మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో లవర్ బాయ్ గా మెప్పించాడు.

అంటే దాదాపు దశాబ్దం తర్వాత రాధేశ్యామ్ సినిమాతో ఫుల్ లవ్ స్టోరీ చూపించబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ లుక్ – స్టైల్ – మ్యూజిక్ అదిరిపోయాయి. మరి స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేతో ప్రభాస్ రొమాంటిక్ లవ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ – ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ – సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్.. ఇలా వరుసగా షెడ్యూల్ బిజీ చేసుకున్నాడు. ఈ సినిమాలు ఒక్కోటి ఒక్కో నేపథ్యంలో తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు. యూవి క్రియేషన్స్ వారు సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here