రైజింగ్ గాళ్స్ ఆశలపై నీళ్లు చల్లిన సెకండ్ వేవ్

0
20

టాలీవుడ్ లో రైజింగ్ స్టార్స్ గా వెలిగిపోతూ ఇరుగు పొరుగు భాషల్లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్న పలువురు భామలకు సెకండ్ వేవ్ బిగ్ పంచ్ వేసింది. వరుసగా సినిమాలకు సంతకాలు చేసినా అవేవీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి సెట్స్ కి వెళ్లాల్సినవి అన్నీ వాయిదా పద్ధతిలో తెరకెక్కించాల్సిన సన్నివేశంలో పడ్డాయి. దీంతో ఇప్పుడు సదరు భామామణులంతా కాల్షీట్ల సర్ధుబాటు కోసం నానా తంటాలు పడాల్సి ఉంటుంది.

ఒక్కో భామ రెండు మూడు భాషల్లో ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. కానీ ఏడాదిన్నర కాలంగా కరోనా వల్ల అంతా కాలహరణం అవ్వడం పెద్ద మైనస్ గా మారింది. సెట్స్ పై ఉన్నవి పూర్తి చేయాలి. కొత్త వాటికి కాల్షీట్లు సర్ధుబాటు చేయాలి. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా మారుతోందట.

ఇక రైజింగ్ స్టార్స్ లో రష్మిక మందన ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలో ఎడా పెడా సంతకాలు చేసేస్తోంది. అటు తమిళంలోనూ నటించేస్తోంది. తనకు రీషెడ్యూలింగ్ లో కాల్షీట్ల సర్ధుబాటు చేయడం కష్టమైనదేనని భావిస్తున్నారు. పుష్ప చిత్రంతో  పాటు రష్మిక అటు బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. ఇవన్నీ రీషెడ్యూలింగ్ ప్రాసెస్ లో ఉండడం తో కాల్షీట్లను మ్యానేజ్ చేయడం చాలా కష్టమైన ప్రాసెస్ అని భావిస్తున్నారు.

మరోవైపు పూజా హెగ్డే – రకుల్ ప్రీత్ – ప్రగ్య జైశ్వాల్ లాంటి భామలు తెలుగు సినిమాలు చేస్తూనే అటు హిందీ సినిమాల షెడ్యూల్స్ కి లాక్ అయ్యారు. వీళ్లంతా మారిన పరిస్థితుల్లో ముంబై టు హైదరాబాద్ ప్రయాణాలతో ఫుల్ గా స్ట్రెస్ అయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా.

ఇక పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – రాధేశ్యామ్ రిలీజ్ తేదీలు డైలమాలోపడ్డాయి. అలాగే రకుల్ ప్రీత్ అటు బాలీవుడ్ లో వరుసగా రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. అవన్నీ ఆగిపోయాయి. తెలుగులో నటించిన ఒక్క సినిమా రిలీజ్ కాలేదింకా. ప్రగ్య ఎన్ బీకేతో సినిమా చేస్తూనే సల్మాన్ తోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో గుట్టు చప్పుడు కాకుండా ఇమేజ్ పెంచుకోవాలని కలలు గంటోంది. కానీ తన కలలు నిజం అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇలా చూస్తే ఇతర నాయికలకు ఇలాంటి చిక్కులు ఎన్నో. మరి బంగారు భవిష్యత్ కోసం కలలు కన్న ఈ భామలంతా వీటన్నిటినీ ఈ సీజన్ లో ఎలా మ్యానేజ్ చేస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here