రెండోవారంలో బిగ్‌బాస్ రేటింగ్ దారుణంగా.. ఏం రేంజ్‌లో పడిందంటే

0
5

తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షోకు అత్యంత ప్రజాదరణ ఉన్నట్టు ఆ షోకు వచ్చే రేటింగ్స్ స్పష్టం చేశాయి. తొలివారం బిగ్‌బాస్ తెలుగు‌కు రికార్డు స్థాయి రేటింగ్స్ వచ్చాయి. అయితే రికార్డు స్థాయిలో ప్రారంభమైన బిగ్‌బాస్ రేటింగ్స్ రెండోవారంలో కాస్త చతికిలపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే అందుకు ప్రధానమైన కారణం ఐపీఎల్ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రెండో వారం రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

తొలివారంలో బిగ్‌బాస్‌కు రికార్డు స్థాయి రేటింగ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 సరికొత్త రికార్డులతో మొదలుపెట్టంది. బార్క్‌ గణాంకాల ప్రకారం ఆరంభ వారంలో 4.5 కోట్ల మంది ప్రేక్షకులు చూడటంతో 18.5 టీఆర్పీని నమోదు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు వీక్షించారనే విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. రికార్డు గణాంకాలతో ప్రారంభం కావడం నిర్వాహకులకు ఉత్సాహాన్ని కలిగించింది.

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ తెలుగు రికార్డు

ఇక తొలివారం దేశంలోనే ఏ బిగ్‌బాస్‌కు రాని రెస్పాన్స్ వచ్చిందని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియకు 6 కోట్ల ఓట్లు వచ్చాయని, బిగ్‌బాస్ మిగితా భాషలతో పోల్చుకొంటే అత్యధికం. దేశవ్యాప్తంగా ఈ షోకు రికార్డు స్థాయిలో ఆదరణ లభిస్తున్నది. ఈ షోను ముందుకు తీసుకెళ్లడం మీదే బాధ్యత అంటూ కంటెస్టెంట్లకు ఉత్సాహాన్ని కల్పించారు.

ఐపీఎల్ దెబ్బ వేయడంతో

తెలుగు బుల్లితెరపై దూసుకెళ్తున్న బిగ్‌బాస్‌కు రెండో వారంలో ఐపీఎల్ బ్రేక్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ ఉండటంతో క్రికెట్‌ పోటీలను చూడటానికి తెలుగు ప్రేక్షకులంతా టీవీలకు అత్తుకుపోయారు. దాంతో బిగ్‌బాస్ షో రేటింగ్‌పై ప్రభావం పడింది. దాంతో తొలివారంతో పోల్చుకొంటే రెండో వారం రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయితే ఐపీఎల్ సమయంలో కూడా రేటింగ్స్ సంతృప్తికరంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రెండో వారం రేటింగ్ ఇలా

బార్క్ వెల్లడించిన ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు రెండోవారాంతం రేటింగ్ 10.7 వద్ద నిలిచింది. శనివారం 8.83 పాయింట్లు రాగా, ఆదివారం 12.62 పాయింట్లు నమోదయ్యాయి. ఇక వారం మొత్తంలో 8 పాయింట్లు మాత్రమే రావడం గమనార్హం. దీంతో బిగ్‌బాస్ దారుణంగా ఐపీఎల్ దెబ్బ తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

స్టార్ మా.. టీవీ9 టాప్‌ గేర్‌లో

ఇక తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌ రేటింగ్స్ విషయానికి వస్తే.. ఎంటర్‌టైన్‌ముంట్ విషయంలో స్టార్ మా టాప్ గేర్‌లో దూసుకుపోతున్నది. ప్రత్యర్థి ఛానెల్స్‌కు అందనంత దూరంలో స్టార్ మా నిలిచింది. స్టార్ మా 1079 పాయింట్లు సంపాదించుకోగా, జీ తెలుగు 788 పాయిట్లు, ఈ టీవీ 669 పాయింట్లు, జెమిని 465 పాయింట్లు వచ్చాయి. ఇక న్యూస్ ఛానెళ్ల రేటింగ్ విషయంలో టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఎన్టీవీ మంచి పోటీని ఇస్తున్నది. టోటల్ మార్కెట్‌లో టీవీ9 81.2 పాయింట్లతో, ఎన్టీవీ 79.1 పాయింట్లతో, టీవీ5 59.9 పాయింట్లు సొంతం చేసుకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here