రియల్ హీరోకు మద్దతుగా వందల మంది..!

0
26

కరోనా విపత్తు సమయంలో సోనూసూద్ వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఏ అవసరం వచ్చినా కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన్ను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికి కాకున్నా తనకు సాధ్యం అయినంత వరకు సోనూసూద్ సాయం చేస్తూ వస్తున్నాడు. రియల్ హీరోగా పేరు దక్కించుకున్న సోనూసూద్ ప్రస్తుతం విదేశాల నుండి ఆక్సీజన్ ను తెప్పించి మరీ ఇక్కడ అవసరం ఉన్న వారికి అందిస్తూ వస్తున్నాడు. ప్రభుత్వం కూడా చేయలేని పనులు ఆయన చేస్తూ.. చాలా స్పీడ్ గా సాయం అందజేస్తున్నాడు.

సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అవసరం ఉన్న వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది తమ వంతు సహకారంను అందజేస్తున్నారు. సినీ వర్గాల వారితో పాటు ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారంను అందిస్తున్నారు. కోట్ల రూపాయల డొనేషన్ లు సోనూసూద్ కు అందుతున్నాయని తెలుస్తోంది. తన ఛారిటీలకు వస్తున్న డొనేషన్ లతో సోనూసూద్ మరింత మందికి సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ కు డొనేషన్ లు ఇవ్వడం చాలా మంచి విషయం. ప్రభుత్వంకు ఈ సమయంలో విరాళం ఇవ్వడం కంటే సోనూసూద్ కు విరాళం ఇవ్వడం మంచిది. ఆయన అయితేనే ఆ డబ్బుకు సరైన న్యాయం చేస్తాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మీరు ఏ చిన్న విరాళం ఇవ్వాలనుకున్నా కూడా సోనూసూద్ కు మాత్రమే ఇవ్వాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అవసరం ఉన్న వారికి సాయం చేసే వ్యక్తిని వెన్నంటి ఉండాలంటూ వందల మంది లక్షల్లో సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళాలు ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here