రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..!

0
21

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన కీర్తిసురేష్ మొదటిసారి నటిస్తోంది. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్టు అందుకున్న మహేష్.. కొన్నేళ్లుగా వరుస బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నాడు. శ్రీమంతుడు నుండి వరుసగా భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో విజయాలలో ఉన్నాడు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ పై అభిమానులలో ఇప్పటికే అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి.

నిజానికి టైటిల్ నుండి మోషన్ పోస్టర్ వరకు అన్ని ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసాయి. డైరెక్టర్ పరశురామ్ కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. మహేష్ అభిమానులకు సర్కారు పాట పక్కా ట్రీట్ ఇవ్వనుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అయితే దూకుడు – బిజినెస్ మెన్ – ఆగడు హిట్స్ తర్వాత తమన్ మరోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున మహేష్ నుండి ఏదొక అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది.

అయితే ఈసారి సర్కారు వారి పాట నుండి న్యూ పోస్టర్ రిలీజ్ అవుతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఫ్యాన్స్ కూడా మేకర్స్ ఓ రేంజిలో సిద్ధం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ సినిమాలకు సంబంధించిన ప్రతిదీ అభిమానులు ట్విట్టర్ వేదికగా రికార్డులు బ్రేక్ చేస్తుంటారు. ఇప్పటికి మహేష్ ట్వీట్లకు సంబంధించి లైక్స్ – రీట్వీట్స్ రికార్డులు అలాగే ఉన్నాయి. ఈసారి అంతకుమించి ఉండేలా సంచలనం సృష్టించాలని ఫ్యాన్స్ ప్లాన్ వేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటుగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ – జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా వచ్చేఏడాది సంక్రాంతికి రానుందని తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here