రామ్ చరణ్ ని అభిమానించడానికి కారణం అదే

0
25

టాలీవుడ్ లో కమెడియన్ గా రాణించిన మధునందన్ చాలా సినిమాల్లో హీరోకి సమానమైన సెకండ్ లీడ్స్ లో నటించారు. త్వరలో హీరోగానూ పరిచయం కానున్నారు. ఇక ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో తాను పని చేసిన హీరోలతో తన అనుభవాలను వారి వ్యక్తిత్వం గురించి అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.

ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అతడు మరో సచిన్ వంటి వాడని బన్ని హార్డ్ వర్క్ చూసి నేర్వాలని అన్నారు. ఇక తనకు బాగా నచ్చే మంచి మనసున్న బంగారం రామ్ చరణ్ అని కూడా తెలిపారు.

బోయపాటి శ్రీను `వినయ విధేయ రామ` చిత్రంలో అతనితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. చరణ్ తో కలిసి కొద్ది రోజులు మాత్రమే పని చేశానని అయితే ఆ కొద్ది రోజులు చరణ్ గురించి తెలుసుకోవటానికి సరిపోతుందని మధునందన్ వెల్లడించారు. అతడు రత్నం అంటూ పొగిడేశారు. తన అభిమాన నటుడి విషయానికి వస్తే అది చిరంజీవి అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here