‘రాధే శ్యామ్’ ని ట్రెండింగ్ లో నిలిపిన డార్లింగ్ ఫ్యాన్స్..!

0
17

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఫ్యాన్స్ ని ఖుషీ చేసాడు. ఇప్పటికే మూడు సినిమాలని సెట్స్ పైకి తీసుకొచ్చిన డార్లింగ్.. మరో ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నా వాటి నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ‘రాధే శ్యామ్’ మూవీ డిటైల్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘రాధే శ్యామ్’ సినిమా ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు కానీ ఇంకా ఎంత షూటింగ్ పెండింగ్ లో ఉంది.. అది పూర్తయిందా లేదా అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అలానే ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ – ఫెస్టివల్ పోస్టర్స్ – గ్లిమ్స్ తప్ప వేరే అప్డేట్ ఏదీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. దీనికి తోడు ఇప్పుడు కరోనా కారణంగా జులై లో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలో మిగతా సినిమాలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటితో ఒకింత అసహనానికి గురైన అభిమానులు దీన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఎటువంటి కారణం లేకుండా ముందస్తు ప్రణాళికలు లేకుండా ‘రాధే శ్యామ్’ ను ట్రెండ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఒకటిగా నిలిపారు. ఇది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెలియజేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వారికి అప్డేట్స్ విషయంలో ఇంకొన్ని రోజులు నిరాశ తప్పదని అనిపిస్తోంది. మేకర్స్ కూడా సరైన సమయం కోసం వేచి ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఏదేమైనా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్ అనే చెప్పొచ్చు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇదే క్రమంలో ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నారు. అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు ప్రభాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here