రాధేశ్యాం కంటే బ్యాచిలర్ కే కష్టం

0
35

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో ఆవర్లు దక్కించుకుంటున్న పూజ హెగ్డే అతి త్వరలో ప్రభాస్ తో నటించిన రాధేశ్యాం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు ఈమె అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైనది. రెండు సినిమాలు కాస్త అటు ఇటుగా ఒకే సారి విడుదల కాబోతున్నాయి.

ఇటీవల ఒక సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. తాను ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కష్టం గా అనిపించింది. అందులో తనది స్టాండప్ కమెడియన్ పాత్ర అని.. ఆ పాత్రకు మంచి స్పందన వస్తుంది ఆనే నమ్మకం ను పూజ వ్యక్తం చేసింది.

కమెడియన్ గా నటించేందుకు చాలా కష్టపడ్డట్లుగా పూజ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు మరియు ఇప్పటికే చేసిన సినిమాలు అన్ని కూడా తనకు మరింత మంచి పేరును తీసుకు వస్తాయని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. పూజ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ లో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here