రాజేంద్ర ప్రసాద్ నెత్తిన ఎన్టీఆర్ గుదిబండ!

0
23

కామెడీ అంటే.. సినిమాలో ఒక పార్ట్. కమెడియన్ అంటే.. ఆ పార్టులోని క్యారెక్టర్లలో ఒకరు. పాత తరంలో చూసుకున్నా ఇంతే. ఇప్పటి జనరేషన్లో చూసుకున్నా అంతే. కానీ.. కమెడియన్ హీరోగా మారడం అనేది అప్పటి వరకూ తెలుగు సినిమా చరిత్రలో జరగలేదు. అసలు.. చాలా మంది దాన్ని ఊహించి కూడా ఉండరు. కానీ.. దాన్ని సాధ్యం చేసి చూపించారు రాజేంద్ర ప్రసాద్. ఈ తరానికి ఆయన టాలెంట్ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చుగానీ.. కామెడీతోనే స్టార్ హీరోగా వెలిగిపోయారు నటకిరీటి.

అయితే.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోనే జన్మించిన రాజేంద్రప్రసాద్.. కెరీర్ ను ఇబ్బందిగానే మొదలు పెట్టారట. ఎలాగైనా నటుడు కావాలని భావించిన రాజేంద్రుడు.. మద్రాసులో దిగిపోయాడు. అక్కడి ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరిపోయే అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచి ఏకంగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడట.

విషయం తెలుసుకున్న పెద్దాయన.. రాజేంద్రప్రసాద్ నెత్తిన పెద్ద గుదింబడ విసిరేసారట! ”పౌరాణిక పాత్రలకు నా దగ్గరికి వస్తారు. సాంఘిక చిత్రాలకు ఏఎన్నార్ ఉన్నాడు. యాక్షన్ సినిమాలకు కృష్ణ రొమాంటిక్ మూవీస్ కు శోభన్ బాబు ఉన్నారు. ఈ విధంగా మాకు ఓ స్పెషలైజేషన్ ఉంది. మరి నీ స్పెషాలిటీ ఏమిటీ? నిర్మాతలు ఎందుకు నీతో సినిమా తీయాలి?’ అని అడిగారట.

ఈ దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయట రాజేంద్రప్రసాద్ కు. ఏం చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతున్న తరుణంలో.. చార్లీ చాప్లిన్ సినిమా వారోత్సవాలకు వెళ్లారట. ఆ సమయంలోనే.. తాను కామెడీతో ప్రేక్షకులను అలరించే ఛాన్స్ ఉంది కదా..? కామెడీ హీరోగా ఎందుకు ట్రై చేయొద్దని అనుకున్నారట. ఆవిధంగా.. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్.. నటకిరీటిగా ప్రేక్షకులను దశాబ్దాల తరబడి అలరించారు. ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజేంద్ర ప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here