రజనీకాంత్ తో లక్ష్మీ మంచు రేర్ క్లిక్

0
15

సూపర్ స్టార్ రజనీకాంత్ తో మంచు మోహన్ బాబు స్నేహం గురించి తెలిసినదే. మద్రాసులో ఆ ఇద్దరి కెరీర్ సమాంతరంగా మొదలైంది. అజేయంగా కొనసాగింది. బాలచందర్ శిష్యుడిగా అపూర్వరారంగల్ లో విలన్ పాత్రతో రజనీకాంత్ ప్రయాణం మొదలు కాగా.. దాసరి శిష్యునిగా మోహన్ బాబు పేరు పాపులరయ్యింది. కెరీర్ జర్నీలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. స్నేహం కొనసాగించారు. మంచి కుటుంబ అనుబంధం ఉంది. మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో రజనీ స్పెషల్ అప్పియరెన్స్ నాటి రోజుల్లో ఎంతటి సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇక ఎంబీ వారసులు విష్ణు-మనోజ్  కుమార్తె లక్ష్మీ ప్రసన్న  రజనీని అంకుల్ అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా కుటుంబంలో కలిసిపోతారు.

ఒకానొక దశలో రజినీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోవాని మోహన్ బాబు భావించారు. విక్రమసింహ (కొచ్చాడయాన్) ట్రైలర్ లాంచ్ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ తన కుమారులలో ఒకరు రజనీకాంత్ కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకోవాలని కోరుకున్నానని.. బంధుత్వం కలుపుకోవాలనుకున్నామని కూడా తెలిపారు. లతా రజనీకాంత్ కి కూడా తన కోరిక గురించి తెలుసు. కానీ మోహన్ బాబు కోరిక నెరవేరలేదు. కానీ దానిని చెడుగా భావించలేదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో జరుగుతాయని నమ్మారు.

ఇక మంచు మనోజ్ ని తమిళంలో స్టార్ ని చేయాలని కలలుగన్న మంచు లక్ష్మీ అతడి చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో రజనీ కాంత్ ని కలిసేవారు. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆ విషయాన్ని మీడియా ముఖంగానూ వెల్లడించారు. ప్రతిసారీ చెన్నయ్ వెళితే కచ్ఛితంగా రజనీ అంకుల్ ని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. తాజాగా సూపర్ స్టార్ తో మంచు లక్ష్మి రేర్ క్లిక్ ని లక్ష్మీ మంచు స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది అభిమానుల్లో వైరల్ గా మారుతోంది. ఇక రజనీకాంత్ హైదరాబాద్ లో షూటింగుల్లో పాల్గొంటే స్నేహితులు మంచు మోహన్ బాబు.. మెగాస్టార్ చిరంజీవిలను కలవకుండా వెళ్లరు. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అన్నాథే చిత్రీకరణలో రజనీ పాల్గొన్న సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ రజనీ ప్రత్యక్షమైన ఫోటోలు వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here