రకుల్ రావుగా పేరు మార్చుకో.. మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

0
11

సినిమా రంగానికి రాజకీయానికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. సినిమా వాళ్ళు సినిమా కెరీర్ ముగించుకొని కొందరు, సినిమాల్లో నటిస్తూనే కొందరు రాజకీయం చేసిన వారు ఉన్నారు. ఎంజీఆర్ మొదలు తాజా పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేసిన వారే. అయితే సినిమా ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినీ రంగంతో పరిచయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఆయన ఎప్పటికప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా వారికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆయన మంత్రిగా కొనసాగుతుండగా ఆ కారణంతో సినిమా రంగంతో కాస్త పరిచయాలు పెరిగాయి.

పెద్ద హీరోల ఆహ్వానాలతో

కొంతమంది పెద్ద హీరోలు తమ సినిమా రిలీజ్ ఈవెంట్ లకు సైతం కేటీఆర్ ను ఆహ్వానించే పరిస్థితి ఏర్పడింది. ఆయన కూడా కాదనకుండా ఆయా ఈవెంట్లకు హాజరు అవుతూ సినిమా వాళ్ళతో కాస్త మంచి సంబంధాలే ఏర్పరుచుకున్నారు. బహుశా అదే ఆయన తప్పయి ఉండవచ్చు. అందుకే ఆయనకు ఒక హీరోయిన్ తో లింక్ అంటగడుతూ కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది.

ఇల్లు కొన్నప్పుడు కూడా

అసలు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆయన మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన మీద కొందరు నర్మగర్భంగా విమర్శలు చేస్తుంటే, మరోకొందరు ఆధారాలు లేని ఆరోపణలు సైతం చేస్తూ వచ్చారు. అయితే నేరుగా కేటీఆర్ ఈ వ్యవహారాల మీద ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ప్రముఖ హీరోయిన్ హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేయగా దాని వెనుక ఉన్నది కేటీఆర్ అంటూ ప్రచారం జరిగింది.

కేటీఆర్ పేరుని రకుల్ రావుగా

ఈ విషయం మీద కొన్నాళ్ళ తరువాత స్పందించిన సదరు హీరోయిన్ ఇదంతా తన కష్టార్జితం అని ఎవరో ఊరికే ఎందుకు ఇస్తారు ? అని పరోక్షంగా స్పందించింది. అయితే ఇప్పుడు ఏ మాత్రం సందర్భం లేకుండా తాజాగా ఎంపికైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పేరుని రకుల్ రావుగా మార్చుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

మధ్యలో మమ్మల్ని లాగడం దేనికి

నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదే దూకుడు కంటిన్యూ చేస్తూ తనను, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ని టార్గెట్ చేసిన కేటీఆర్ ని ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ సినిమా వాళ్లను మధ్యలో లాగడం ఏమీ బాలేదని సినీ వర్గాలు అంటున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here