రంగస్థలం – పుష్పకు ఉన్న తేడా ఇదే.. అల్లు అర్జున్ పాత్రపై షాకింగ్ విషయాలను లీక్ చేసిన నటి!

0
12

మాస్టర్ మైండ్ దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఊర మాస్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు. స్టైలిష్, రిచ్ లుక్స్ ను పక్కన పెట్టి కాస్త కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రంగస్థలం సినిమా అనంతరం పుష్ప కూడా దాదాపు అలానే ఉంటుందా అనే టాక్ ఎక్కువగానే వస్తోంది. ఈ క్రమంలో అందులో నటించిన ఒక ఆర్టిస్ట్ అసలు క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా బన్నీ పాత్రపై కూడా ఒక విషయం లీక్ చేశారు.

అలాంటి సినిమా తీస్తాడాని ఊహించ లేదు.

రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్ ను క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ అలాంటి సినిమా తీస్తాడాని ఎవరు ఊహించ లేదు. రామ్ చరణ్ ను సరికొత్త గెటప్ లో ప్రజెంట్ చేసి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. ఇక పుష్ప కోసం కూడా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు.

పుష్ప రాజ్ పాత్రలో నెగిటివ్ షేడ్స్

అల్లు అర్జున్ తో ఇంతకుముందు ఆర్య, ఆర్య 2 అంటూ ప్రేమ కథలను తీసిన సుకుమార్ మూడవసారి కూడా అలాంటి కథతోనే రావచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఊర మాస్ సినిమాతో తో వస్తున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ విబిన్నంగా కనిపిస్తున్నాడు. హీరో పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట.

ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన నటి

ఇక రంగస్థలం, పుష్ప సినిమాకు కాస్త పోలికలు ఉంటాయని కథనాలు చాలానే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అందులో నటించిన ఒక ఆర్టిస్ట్ వివరణ ఇచ్చింది. దివ్య అనే నటి స్ఐనిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. అయితే ఆమె సినిమాపైనే కాకుండా అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టేసింది.

రంగస్థలం, పుష్పకు ఉన్న తేడా..

ఆర్టిస్ట్ దివ్యా మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాకు పుష్ప మూవీకి అసలు సంబంధమే లేదు. ఆ స్టోరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ గా గంధపు చెక్కల స్మగ్లింగ్.. ఆ స్టైల్ లో ఉంటుంది. అసలు కథ నాకు తెలియదు గాని టీజర్ కు తగ్గట్లుగానే సినిమా ఊహించని విధంగా ఉంటుంది.. అని మాట్లాడారు.

బన్నీ పాత్ర ఎలా ఉంటుందంటే..

అదే విధంగా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. బన్నీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పే విధానం బాడీ లాంగ్వేజ్ టీజర్ లో సిరియాస్ గా అనిపించింది. కానీ మిగతా సన్నివేశాల్లో మాత్రం కాస్త కామెడీగా గా ఉంటుంది. చాలా ముద్దొస్తుంటుంది. లొకేషన్స్ లో చూసినపుడు క్లియర్ గా అర్ధమయ్యింది. సెట్స్ లో బన్నీ అందరితోను చాలా ఫ్రెండ్లిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.. అని దివ్య వివరణ ఇచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here