యాస భాషతో ఇకపైనా పవన్ కల్యాణ్ మ్యాజిక్ చూస్తారు

0
46

తన సినిమాల్లో ప్రాంతీయ యాస భాషను సంస్కృతిని ప్రదర్శించడం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి కొత్తేమీ కాదు. అతడు నటించే ప్రతి సినిమాలో ఎంచుకున్న పాత్రను కథను బట్టి ఏదో ఒక చోట యాసను పలకడం ద్వారా పంచ్ లు వేయడం ద్వారా అభిమానుల నుంచి గొప్ప స్పందనను అందుకుంటారు. ఉత్తరాంధ్ర.. నైజాంలో పవన్ కి ఉన్న మాసివ్ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఆ రెండు యాసల్ని ఒక పంక్తి లేదా పదంలో అయినా ప్రెజెంట్ చేసిన సందర్భాలున్నాయి.

వకీల్ సాబ్ లో నైజాం యాసతో పవన్ చేసిన మ్యాజిక్ తెలిసిందే.  కరీంనగర్(తెలంగాణ) జిల్లాకు చెందిన దర్శకుడు వేణు శ్రీరామ్ తెలంగాణ యాసలో పవన్ కి సరైన పంచ్ లు రాయించారు. పవన్ కేవలం ఈ సినిమాలోనే కాదు.. క్రిష్ దర్శకత్వంలోని హిస్టారికల్ డ్రామా `హరి హర వీరమల్లు` మినహా ఇతర సినిమాల్లో సరికొత్త యాసతో రంజింపజేయనున్నారని తెలిసింది.

పవన్ కథానాయకుడిగా సాగర్ చంద్ర రూపొందిస్తున్న రీమేక్ చిత్రంలో పవన్ రాయలసీమ యాస మాట్లాడతారు. ఇది మలయాళ హిట్ అయ్యప్పనమ్ కోషియం కి తెలుగు రీమేక్. ప్రస్తుతం పవన్ షూటింగ్ లో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. రచయిత పెంచల్ దాస్ సాయంతో సీమ యాసను త్రివిక్రమ్ బృందం ప్రిపేర్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు.

ఇక క్రిష్ తో మూవీలో సరళమైన భాషతో పాటు అక్కడక్కడా గ్రాంధికంలో పంచ్ లు ఉంటాయని కూడా తెలుస్తోంది. తదుపరి హరీష్ శంకర్ దర్శకత్వంలో సాధారణ భాషను మాట్లాడుతారు. యాస భాష సంస్కృతిని సన్నివేశాల్లో జొప్పించడం ఆషామాషీ కాదు. నటుడిలో దర్శకరచయితల్లో చాలా మ్యాటర్ ఉంటే కానీ అవి వర్కవుట్ కావు. స్పాంటేనియస్ గా ఉండాలి. టైమింగ్ కూడా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here