యంగ్ టైగర్ బర్త్ డే సర్ప్రైజ్ లేదట!

0
22

మోస్ట్ అవెయిటింగ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్. ఇలాంటి భారీ సినిమాల నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చేస్తుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే అభిమాన హీరో లేదా దర్శకుడి మూవీ అప్డేట్స్ వస్తే మాత్రం ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ప్రస్తుతం సినీఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం.. ఎవరు ఎలాంటి సినిమా తీసినా పుట్టినరోజులకు మాత్రం ఓ అప్డేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోను ఫేవరేట్ హీరోల పుట్టినరోజులైతే ఖచ్చితంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ లాంటివి ఎక్సపెక్ట్ చేస్తుంటారు ప్రేక్షకులు.

గతంలో అంటే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదు కాబట్టి అప్డేట్స్ గురించి పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అప్పటిలాగా పేపర్లో లేదా గోడమీద పోస్టర్స్ టీవీ యాడ్స్ చూసి అప్డేట్స్ తెలుసుకునే కాలం పోయింది. పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడ్డారు మేకర్స్ అండ్ ఆడియన్స్. అయితే మే 20న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా రాజమౌళి బృందం నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి మినిమం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. కానీ ఆర్ఆర్ఆర్ పరంగా హ్యాపీనే అయినా కొరటాల శివ మూవీ నుండి మాత్రం ఏ అప్డేట్ వచ్చేలా లేదని టాక్.

ఎందుకంటే ఇటీవలే ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాలతో ప్రకటించాడు. మరి ఓవైపు కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ జరగడం లేదు. అందులోను కొరటాల – ఎన్టీఆర్ మూవీ కేవలం అనౌన్స్ మెంట్ వరకే జరిగింది. ఇంకా షూట్ ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు అని సినీవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్ నుండి మాత్రం వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. మరి మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు హవా ఎలా ఉండబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here