మై లైఫ్ మై వైఫ్ అంటున్న గోపీచంద్!

0
17

కరోనా వైరస్ మనుషుల మధ్య దూరాన్ని పెంచినా.. మనసుల దూరం తగ్గించి మరింత చేరువ చేస్తోందన్నది వాస్తవం. బిజీ లైఫ్ ని కిల్ చేసి ఇంట్లోనే ఓచోట కలిసేలా వెసులుబాటు కల్పించింది. బిజీ లైఫ్ లో పడి బంధాల్ని అనుబంధాల్ని ఎంతగా మిస్సయ్యామో కరోనా చూపించింది. ఈ సమయంలో సెలబ్రిటీలు ఇంట్లోనే కుటుంబీకులతో స్పెండ్ చేస్తున్నారు.

తాజాగా నటుడు గోపీచంద్ కూడా అలాంటి సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. షూటింగుల్ని పక్కన పెట్టిన అతడు తన భార్య రేష్మ పెళ్లి రోజు సందర్భంగా తనతోనే స్పెండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా గోపీచంద్ తన భార్యకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాక్షలు తెలిపాడు. హ్యాపీ యానివర్సరీ టు ది `మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ మై వైఫ్! ` అంటూ రాసుకొచ్చాడు.

ఆ ఇద్దరు కలిసి విదేశాల్లో దిగిన ఓ పాత ఫోటోని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు గోపీచంద్. ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని.. చూడ ముచ్చటగా ఉందంటూ విషెస్ చెబుతూ గోపి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

గతఏడాది నుంచే షూటింగ్ లు బంద్ కావడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమ్యారు.  ప్రస్తుతం గోపీ చంద్ సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ చిత్రంలో నటించారు. త్వరలో రిలీజ్ కి రానుంది. మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్శియల్` చిత్రీకరణలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here