‘మేకోవర్’తో వేగం పెంచనున్న అక్కినేని హీరో..!

0
16

టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే ఇటలీ దేశంలో ‘థాంక్యూ’ మూవీ మెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో థాంక్యూ సినిమా మొత్తం షూటింగ్ ముగిసినట్లే అవుతుంది. మనం మూవీతో అక్కినేని ఫ్యామిలీకి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కుమార్ ఈ థాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే హీరో నాగచైతన్య వీలైనంత త్వరగా థాంక్యూ షూటింగ్ పూర్తిచేసి వెంటనే తాను నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుండగా.. నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య ఓ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసం బాడీని మేకోవర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని.. అందుకు తగినంత సమయం కూడా కేటాయించాల్సి వస్తుందనే ఆలోచనలో ప్లాన్ చేసుకుంటున్నాడు చైతూ. నిజానికి లాల్ సింగ్ చద్దా కోసం చైతూ కేవలం 15రోజులే కేటాయించినట్లు సమాచారం. అలాగే చైతూ పార్ట్ మొత్తం లడఖ్ లో షూట్ చేయబడతాయని సినీవర్గాలు చెబుతున్నాయి.

అయితే హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ చేస్తుండటం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం నాగచైతన్య కెరీర్ ప్లాన్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత వెంటనే మళ్లీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు చైతూ. మొత్తానికి ఒకేసారి అటు బాలీవుడ్ డెబ్యూ ఇటు డిజిటల్ డెబ్యూ చేయనున్నాడు ఈ అక్కినేని హీరో. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here