మెగా- అల్లు ఫ్యామిలీల పాలిట దేవత

0
17

 కరోనా సెకెండ్ వేవ్ మెగా ఫ్యామిలీ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ వారు చికిత్సతో వేగంగా కోలుకోగలిగారు. దాని వెనక ఉపాసన- అపోలో వర్గాల సేవలు ఉన్నాయి. వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో పవర్ స్లార్ పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ రావడంతో సెల్ప్  ఐసోలేషన్ లో ఉండి కోలుకున్నారు. అయితే ఇదంతా ఈజీగా జరగలేదు.

పవన్ కళ్యాణ్ విషయంలో మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య  ఉపాపసన ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. పవన్ కు కొవిడ్ పాజిటివ్ అని తేలగానే వెంటనే అపోలో ఆసుపత్రి డాక్టర్ల బృందాన్ని పవన్ ఫామ్ హౌస్ కు పంపించారు. అప్పటి నుంచి మళ్లీ నెగిటవ్ వచ్చే వరకూ అపోలో టీమ్ అక్కడ ఉండి పవన్ కు వైద్య సేవలు అందించారు. ఉపాసన ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ పవన్ కోలుకునే వరకూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.

వైరస్ సోకితే ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి? ఇలా అన్ని రకాలా ఉపాసన మార్గనిర్ధేశనంతోనే పవన్ త్వరగా కోలుకున్నారు. ఇక ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా  వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నిని కూడా ఉపాసన దేవతలా ఆదుకున్నారట. బన్నీ సైతం త్వరగా కోలుకోవాలని మెగా కోడలు మంచి ఫుడ్ డైట్ తో కూడిన ప్యాక్ ఒకటి పంపించారు.

ఇన్పెక్షన్ సోకిన సమయంలో  ఎలాంటి ఆహార ప్రదార్థాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారో తన అపోల్ టీమ్ ని అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా బన్నీ కోసం డైట్ చార్ట్ పంపించారట. ఎప్పటికప్పుడు బన్నీ ఆరోగ్యంపై వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకుంటూ తగు జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న బన్నీకి వైద్యబృందం సహాయంతో పాటు ఉపాసన డైట్ ప్లాన్ చాలా సహకరిస్తోందని సమాచారం. మొత్తానికి మెగా కోడలు కరోనా సమయంలో మెగా- అల్లు ఫ్యామిలీల పాలిట దేవతగా మారిపోయింది. మెగా అల్లు కుటుంబాల్లో ఓవరాల్ గా నలుగురికి కరోనా సోకితే అందరికీ ఉపాసన సాయం అందింది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో కుటుంబీకుల కేర్ చాలా ముఖ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here