మెంటలెక్కించడం ఆవిడ ప్రత్యేకత!

0
20

టీజింగ్ టెంప్టింగ్ అనేవి అరుదైన క్వాలిటీస్. ఇది అందరికీ సాధ్యం కానిది. ఇటీవలి కాలంలో అందాల మలైకా అరోరా అనుసరిస్తున్న వ్యూహం యువతరంలో ఆసక్తికర డిబేట్ కి తెర తీస్తోంది. ఈ భామ ప్రతిసారీ జిమ్ కి వెళుతూనో లేక తన పప్సీ కాస్పర్ తో జాగింగ్ కి వెళుతూనో జిమ్ యోగా సెషన్స్ కి వెళుతూనో.. ఎక్కువగా మీడియా కంట పడుతోంది.

తనని వెంబడించి మరీ ఫోటోగ్రాఫర్లు క్లిక్ లతో విరుచుకుపడుతుంటారు. ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిలో మలైకా బెస్ట్ క్లిక్స్ ఏవి? అన్నది చూస్తే.. చాలా సందర్భాల్లో పబ్లిక్ లో పొట్టి నిక్కరులో అలాగే ఖరీదైన బ్రాండెడ్ జాగర్స్ లో వెళుతూ ఉన్నవి సంథింగ్ స్పెషల్ గా కనిపించాయి .

వీటన్నిటినీ మించి మలైకా యోగా ఫీట్లు.. జిమ్ లో చెమటలు కక్కుతూ వర్కవుట్లు చేసే విధానం భంగిమలు యూత్ ని మెంటలెక్కించాయి. 40వయసులో మలైకా ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఫిట్నెస్ ని కాపాడుకునే తీరు యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరోవైపు మలైకా నిరంతర యోగా క్లాసులు చాలా నాలెజ్ ఫుల్ గా అలరిస్తున్నాయి.

తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ ని ఈ భామ పెళ్లాడేందుకు సిద్ధంగా లేదని తాజా సన్నివేశం చెబుతోంది. ప్రస్తుతానికి ఈ జంట కలిసే ఉంటున్నా.. పెళ్లి మాటెత్తితే దానిపై పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు మలైకా రకరకాల కోణాల్లో మీడియా హెడ్ లైన్స్  లో నిలుస్తుండడంతో పలు కార్పొరెట్ కంపెనీలు తనవైపు కోట్లాది రూపాయల కాంట్రాక్టులతో క్యూ కడుతున్నాయిట. మలైకా ప్రతి కదలిక వెనక ఒక బ్రాండ్ కనిపిస్తూనే ఉంది. తద్వారా లక్షల్లో పారితోషికాలు అందుతున్నాయనే అర్థం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here