మురిసి పోతున్న మహేష్ బాబు ఫ్యాన్స్

0
54

సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి వరకు కూడా ఒకదారి తర్వాత మరోటి అంటూ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమాను ప్రకటించిన సందర్బాలు చాలా ఉన్నాయి. కాని ప్రస్తుతం మాత్రం మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో ఉంచాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే త్రివిక్రమ్ మూవీ అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. సర్కారు వారి పాటతో సమాంతరంగా త్రివిక్రమ్ సినిమా కూడా మహేష్ బాబు చేస్తాడట. సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుండగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కొద్ది గ్యాప్ లోనే వచ్చే సమ్మర్ లో విడుదల కాబోతుంది.

సర్కారు వారి పాట మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు మాత్రమే కాకుండా మహేష్ బాబు లైన్ లో మరో రెండు మూడు సినిమాలను కూడా ఉంచాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. కేవలం మూడు నెలల్లోనే మహేష్ బాబు.. అనీల్ రావిపూడి సినిమా పూర్తి అవుతుందని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రాజమౌళి సినిమాలో మహేష్ బాబు జాయిన్ అయ్యే అవకాశం ఉందటున్నారు.

జక్కన్నతో సినిమా ఆలస్యం అయితే గ్యాప్ లో మరో సినిమాను కూడా మహేష్ బాబు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మొత్తంగా మహేష్ బాబు కెరీర్ లోనే మొదటి సారి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. వరుసగా మహేష్ బాబు సినిమాలు చేయడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమాలు వచ్చే ఏడాది రెండు లేదా మూడు విడుదల అయ్యే అవకాశాలు ఉన్న కారణంగా వారు మురిసి పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here