మీ మీద అసహ్యానికే అసహ్యం వేస్తుంది!

0
26

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత ఉండటం‍తో సరైన సమయానికి వైద్యం అందక కళ్లముందే చనిపోతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల వ్యవహరిస్తున్న తీరు.. కార్పోరేట్ హాస్పిటల్స్ దోపిడీపై ఆర్పీ మాట్లాడారు. ‘మా అమ్మకు బెడ్ దొరకలేదని హాస్పిటల్ సిబ్బంది మీద కొంతమంది దాడి చేశారు. బెడ్స్ లేనప్పుడు వారు ఇవ్వలేరు కదా?.. అమ్మ చనిపోతే కోపం రావచ్చు.. కానీ కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్న సిబ్బందిపై దాడి చేయడం వల్ల మిగతా వాళ్లు బాధ పడాల్సి వస్తుంది’ అని ఆర్పీ చెప్పుకొచ్చారు.

అయితే ఆర్పీ పట్నాయక్ పోస్ట్ చేసిన చేసిన వీడియోను యూట్యూబ్ ఛానళ్లు డిఫరెంట్ థంబ్ నెయిల్స్ పెట్టి పోస్ట్ చేశారు. వాళ్ళు పెట్టిన హెడింగ్స్ పై అభ్యంతరం తెలిపిన ఆర్పీ.. సదరు యూట్యూబ్ ఛానల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”వీడియోలో ఎవరినో ఉద్దేశిస్తూ మా అమ్మ అని సంభోదిస్తే.. ఆర్పీ తల్లికి కరోనా వచ్చిందని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు హెడింగ్స్ పెట్టారు. అలాగే జనరల్ గా రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడితే.. ఆర్పీ పట్నాయక్ ఫలానా రాజకీయ నాయకుడి గురించి కామెంట్స్ చేశాడు అని టైటిల్ పెట్టారు” అని ఆర్పీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి వాటి వల్లే యూట్యూబ్ ఛానల్స్ అంటే అసహ్యమని.. అందుకే నేను యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వనని చెబుతా అని ఆర్పీ అన్నారు. ”బుర్ర లేని వారందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. అర్థం పర్థం లేకుండా హెడింగ్స్ పెడుతున్నారు.. ఛా..మీదీ ఒక బ్రతుకేనా.. మీ మీద అసహ్యానికే అసహ్యం వేస్తుంది” ఆర్పీ పట్నాయక్ ఫైర్ అయ్యారు. ఇక చివరగా తాను ముందుగా చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చిందని తెలుపుతూ.. కరోనా జాగ్రత్తలను వీడియోలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here