మా వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్లెవరూ పట్టించుకోలేదు: సురేఖా వాణి

0
34

తెలుగు ప్రేక్షకులకు సురేఖా వాణి బాగా పరిచయమే. యంగ్ మదర్ రోల్స్ తో పాటు అక్క .. వదిన పాత్రలతో ఆమె ఆకట్టుకుంటూ వెళుతున్నారు. తనకి ఇచ్చిన పాత్రలో ఎలా ఒదిగిపోవాలో .. ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ కావాలో ఆమెకి బాగా తెలుసు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ సందడి చేయడం ఆమెలోని ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. అలాంటి సురేఖా వాణి ఈ మధ్య తన భర్తను కోల్పోయారు. అందుకు సంబంధించిన విషయాలను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.

“మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము … మొదటి నుంచి కూడా ఆయనకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేవి. తనకి షుగర్ వచ్చి పదేళ్లకు పైగా అయింది. ఆ షుగర్ వలన అప్పుడప్పుడు వంట్లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉండేది. బ్లడ్ ఎప్పుడు ఎక్కడ క్లాట్ అవుతుందో చెప్పలేం. అలా ఒక కాలులో బ్లడ్ క్లాట్ అయితే కాలువ్రేళ్లు తీసేయవలసి వచ్చింది. అలా జరిగినప్పుడు తనకి తెలియకుండా నేను చాలా ఏడ్చేశాను. అలా వ్రేళ్లు తీసిన ఒక నెలలోనే ఆయన చనిపోయారు. ఆయన ధైర్యంగానే ఉండటంతో ఓకే అనుకున్నాను .. కానీ చనిపోతారని అసలు ఊహించలేదు.

ఒక రోజున ఆయనకి హఠాత్తుగా ఆయాసం వచ్చింది .. డయాబెటిక్ వలన హార్ట్ ఎటాక్ వచ్చిన విషయం తెలిసి షాక్ అయ్యాను. మా అత్తగారు వాళ్లు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనీ .. లక్షలు ఖర్చు అవుతున్నాయని వాళ్లకి తెలుసు. అయినా ఎప్పుడూ కూడా వాళ్లు ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఆయన వైపు నుంచి నాకు వచ్చిన ఆస్తులు కూడా ఏమీలేవు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ల వాళ్లెవరూ పట్టించుకోలేదు. మా వారిని నేను ఎలా చూసుకున్నాననే విషయం అందరికీ తెలుసు” అని చెప్పుకొచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here