మా నాన్నకు నాలుగు పెళ్లిళ్లు.. అందుకే నేను కూడా.. – నటి

0
53

బాలీవుడ్ నటి పూజా బేడీ.. తన భర్త నుంచి 18 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా.. తన విడాకుల గురించి మీడియాతో పంచుకున్నారు. తాజాగా జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎదురైన ఇబ్బందులు.. విడాకులు తీసుకోవడానికి వచ్చిన పరిస్థితులు వివరించారు.

”ఫర్హాన్ వాలాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే.. వైవాహిక జీవితాన్ని ఎన్నో విభేదాలతోనే నెట్టుకొచ్చాను. దీంతో.. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే.. పిల్లలు ఎదిగే వయసులో ఉన్నారు కాబట్టి.. ఇది సరైన నిర్ణయం కాదు అని స్నేహితులు బంధువులు చెప్పారు.” అని పూజా బేడీ తెలిపారు.

వాళ్లు చెప్పింది ఆలోచించినప్పటికీ.. తనకు విడాకులు తీసుకోవడమే సరైందని అనిపించిందట. రాజీపడినా.. బంధం నిలుస్తుందనే ఆశ తనకు లేకపోయిందని అందువల్ల విడిపోవడమే పరిష్కారం అని నిర్ణయించుకున్నానని చెప్పారు పూజా. విడాకులు తీసుకుంటే జీవితం సర్వనాశనం అయిపోతుందని చాలా మంది భయపెట్టినప్పటికీ.. అవన్నీ లెక్క చేయకుండా ముందుకే వెళ్లానని చెప్పారు.

”ఎంత మంది ఎన్ని చెప్పినా.. నా తండ్రి కబీర్ బేడీ జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్నాను” అని చెప్పారు. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు విడాకులు తీసుకున్నారు. మొత్తంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన అన్నిసార్లు విడాకులు తీసుకొన్న తర్వాత సంతోషకరమైన మనుషులు ఆయన జీవితంలోకి వచ్చారని తెలిపారు పూజా. అందుకే తాను కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

కాగా.. పూజాబేడీ ప్రస్తుతం మానెక్ కాంట్రాక్టర్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీళ్లకు సంబంధించిన ఫొటోలను ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేశారు పూజా. తన జీవితాన్ని అనుకున్నట్టుగానే ఆస్వాదిస్తున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here