మాస్టర్ బ్యూటీ మత్తెక్కించే అందాలవిందు

0
28

లేటెస్ట్ ట్రెండ్ బట్టి సినీ ఇండస్ట్రీలో కూడా మార్పులు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగు – తమిళం – హిందీ అనే భాషాబేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీలను గ్లామర్ షోతో అదరగొడుతున్నారు కుర్రభామలు. ప్రస్తుతం అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. కొంతకాలంగా మాళవిక సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో నటించింది.

కానీ ఆ సినిమా మాళవికకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ సినిమాలో చీరకట్టుతో మెప్పించిన మాళవిక ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తుంటే.. వయ్యారిని చూసి కళ్ళప్పగిస్తున్నారు గ్లామర్ ప్రియులు. నిజానికి సినిమాలేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం చిచ్చురేపుతోంది. తెలుగులో ఇంతవరకు ఒక్కసినిమా కూడా చేయలేదు కానీ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజిలో క్రియేట్ చేసుకుంది. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలవిందుతో  కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో న్యూ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలో చూపులతో మత్తెక్కిస్తూ ఫ్యాన్స్ చూపులను ఎదసొంపులపై పడేలా పోజిచ్చింది. పేపర్ గ్రే కలర్ టాప్ టు బాటమ్ డ్రెస్సులో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మలయాళీ కుట్టి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో అదృష్టం చెక్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. గల్లీబాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది సరసన ‘యుద్రా’ అనే సినిమాలో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా 2022 సమ్మర్ లో విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here