మహేష్ బాబుతో మూవీపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం.. ఎప్పుడో చేయాల్సింది..

0
12

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శకులతో వర్క్ చేయడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటారు. అయితే అప్పట్లో కథపై కాకుండా దర్శకులపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టేవారు. అయితే కొన్ని డిజాస్టర్స్ అనంతరం ఆయన ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నంతో కూడా ఒకసారి సినిమా చేయాలని అనుకున్నాడు కానీ కుదరలేదు. ఇటీవల మణిరత్నం మహేష్ బాబుతో ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

బ్రహ్మోత్సవం సినిమాతోనే అర్ధమయ్యింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ దర్శకులను నమ్ముతున్నాడు గాని కథలో నమ్మకం లేకపోతే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తున్నాడు. గతంలో బ్రహ్మోత్సవం సినిమాతోనే ఆయనకు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. దర్శకుడి మీద అతి నమ్మకంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం కాకముందే షూటింగ్ స్టార్ట్ చేశాడు. దీంతో సినిమా అనుకోని విధంగా డిజాస్టర్ అయ్యింది.

రీమేక్స్ కూడా చేయవద్దని..

ఇక రెండు డిజాస్టర్స్ వరుసగా ఎదురవ్వగానే మహేష్ రిస్క్ చేయవద్దని స్టార్ దర్శకులను సైతం రిజెక్ట్ చేశాడు. అలాగే రీమేక్స్ కూడా చేయవద్దని కూడా మెంటల్ గా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఆ మధ్య శంకర్ త్రీ ఇడియట్స్ సినిమాకు ఆఫర్ వచ్చినప్పటికీ ఓకే చేయలేదు. ఒకసారి చేసిన సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం తనకు ఇష్టం ఉండదని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు.

ప్రాజెక్ట్ సెట్టయినట్లే

ఇక మణిరత్నం కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి మధ్యలో గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. మహేష్ బాబుకు ఇష్టమైన దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. కథ చెప్పడానికి వస్తున్నారు అనగానే దాదాపు ప్రాజెక్ట్ సెట్టయినట్లే అని అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చాయి. కానీ మహేష్ కథపై అంతగా నమ్మకం వ్యక్తం చేయకపోవడంతో ప్రాజెక్ట్ సెట్టవ్వలేదు.

మంచి కథ సెట్టయితే

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. గతంలోనే మహేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. అయితే మంచి కథ సెట్టయితే మాత్రం మరోసారి మహేష్ బాబును కలిసే స్నేహం తనకు ఉందని కుదిరినప్పుడు తప్పకుండా మహేష్ తో సినిమా చేస్తానని కూడా అన్నారు. ఇక ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here