మహేష్ అయితే చెంప దెబ్బ అలా కొడతారా?

0
22

చెంప దెబ్బ కొట్టడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. బాలయ్యదో స్టైల్ అని ఇంతకుముందు ఓ సీనియర్ నటుడు చెప్పకనే చెప్పగా.. ఇతర స్టార్లు చెంప దెబ్బ సన్నివేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి వారి అభిమానులకు ఉంటుంది. ఇంతకీ మహేష్ అయితే చెంప దెబ్బ ఎలా కొడతారు?  కాలర్ పట్టుకోవాలంటే ఏం చేస్తారు..! అంటే..

ఆర్టిస్టు ముందుకు చకచకా వెళ్లి చెంప దెబ్బ కొట్టే డూప్ యాక్షన్ చేస్తారు. అతడిని పక్కకు ఠకీమని వంగమని చెబుతారు. కోఆర్టిస్టు అలా చేయగానే షాట్ పూర్తవుతుంది. అలా ఎదుటి ఆర్టిస్టు చెంప ఫెడీల్మన కుండా తప్పించుకోగలడు. నిజానికి ఈ సన్నివేశంలో తదనుగుణంగా నటించడం అనేది సదరు ఆర్టిస్టు ప్రతిభ అన్నమాట.

ఒకవేళ కో ఆర్టిస్టు కాలర్ పట్టుకునే సన్నివేశం అయితే మహేష్ ఏం చేస్తారు? అన్నది తెలుసుకుంటే అది కూడా ఆసక్తికరం. ముందు ఆర్టిస్టు దగ్గరకు నడుచుకుంటూ వచ్చి కాలర్ పట్టుకునే ముందే మీకు అభ్యంతరం లేదు కదా? అని తనదైన శైలిలో సర్కాస్టిక్ గా అడిగేస్తారు. ఎదుటివారు స్మైల్ ఇయ్యగనే చటుక్కున షాట్ పూర్తి చేసి కారవ్యాన్ వైపు వెళ్లిపోతారు. మహేష్ తో కలిసి నటించిన ఓ సీనియర్ ఆర్టిస్టు చెప్పిన సంగతులివి.

ఇలా మహేష్ ఒక్కరే కాదు చాలా మంది స్టార్లు చేసేది ఇదే. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా ఆర్టిస్టుతో కలిసి పోయి పని చేయడానికి ఇష్టపడతారు. మహేష్ అయితే ఎంతో క్రమశిక్షణగా తన పని తాను చేసుకుని వెళతారు అని తెలిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా సాటి ఆర్టిస్టు కాలర్ పట్టుకోవడానికి లేదా చెంప దెబ్బ కొట్టేందుకు అనుమతి తీసుకోవడం అనే అలవాటు మహేష్ కి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here