మళ్ళీ బాబుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్.. ఓరకంట కనిపెడుతూనే సైలెన్స్!

0
9

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లో ఉన్నా సరే రాజకీయాల్లోకి రావాలని ఫాన్స్ డిమాండ్ చేస్తూ ఉంటారు.. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోరు. తాజాగా ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఫ్యాన్స్ చేసిన పని టీడీపీ అధినేతకి షాక్ ఇచ్చినట్టయింది.

ఎన్నికల కోసం

తెలుగులో నందమూరి కుటుంబం అంటే తెలియనివారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ లాంటి నటుడు సినీ పరిశ్రమలో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నందమూరి కుటుంబానికి రాజకీయాలతో కూడా ఉండడంతో ఎన్టీఆర్ కూడా 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వచ్చింది.

యాక్సిడెంట్ తో

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. అయితే ప్రచారం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ కూడా గెలవలేదు. దీంతో మళ్లీ ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా కనిపించింది లేదు.

ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం

అయితే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం నుంచి ఎక్కువగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.. ఆయన పార్టీ పగ్గాలు చేపడితే కానీ పార్టీకి పునర్వైభవం రాదంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ ఏకంగా చంద్రబాబుకి షాక్ ఇచ్చారు.

మొన్న అక్కడ ఇవాళ ఇక్కడ

ఇటీవల చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుకి షాక్ తగలగా ఇప్పుడు కూడా పరిస్థితి ఎదురైంది. ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన బాబుకు అదే సీన్ రిపీటైంది. ఇటీవల మృతి చెందిన పెదన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మచిలీపట్నం వచ్చిన చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు.

బాబు సైలెన్స్

టీడీపీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఎదురొచ్చి ఆయనకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. జై బాబు.. జై జై బాబు..అంటూనే నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చంద్రబాబు నుంచి పెద్దగా స్పందన ఏమీ లేదని అంటున్నారు. బాబు ఎక్కడికి రాష్ట్రంలోని పలుచోట్ల ఇలాంటి సీన్‌లే రిపీట్ అవుతుండడంతో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారు ఏమో చూడాలి మరి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here