మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ.. బీచ్ లో బికినీతో ట్రీట్!

0
9

బాలీవుడ్ నటి దిశా పటాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గ్లామరస్ ఫోటోలు మరియు డ్యాన్స్ వీడియోలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆమె ఎప్పుడెప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుందా ? అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె షేర్ చేసిన తాజా ఫోటో రచ్చ రేపుతోంది.

మళ్ళీ రచ్చ

కొంతకాలం క్రితం ఆమె షేర్ చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయ్యింది, దీనిలో ఆమె ‘కిస్ మి మోర్’ అనే ఇంగ్లీష్ సాంగ్ కోసం డ్యాన్స్ చేయడం కనిపించింది. దీని తర్వాత, ఆమె ఇప్పుడు తన బికినీ ఫోటోను అభిమానులతో పంచుకుంది. దెబ్బకు ఈ ఫోటో వైరల్ అవుతోంది. దిశా పటాని తన ఓ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దిశా పటాని బీచ్ లో పడుకున్నట్లు ఫోటోలో చూడొచ్చు.

దిషూ సో క్యూట్’

ఈ ఫోటోలో ఆమె లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఫోటోలో, దిశా పటాని బ్రౌన్ కలర్ బికినీ ధరించి ఉంది. అతని ఈ ఫోటోపై అభిమానులు ఆమెకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల్లో ఒకరు ‘వెరీ బ్యూటిఫుల్’ అని, మరొక అభిమాని ‘దిషూ యు సో క్యూట్’ అని కామెంట్ చేశారు. ఇక అభిమానులే కాక దిశా పటాని ఫోటో పై, టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ కూడా ఎమోజితో కామెంట్ చేశారు.

ఎంట్రీ అలా

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో అవకాశం దక్కడంతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ భామ యాక్టింగ్ పరంగా కూడా అలరించింది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంది.

సినిమాల విషయానికి వస్తే

దిశా పటాని 2015 స్పోర్ట్స్ ఫిల్మ్ బయోపిక్ ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభించింది. ఇందులో ఆమెతో పాటు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించారు. దీనితో పాటు మోహిత్ సూరి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మలంగ్’ లో కూడా ఆమె కనిపించారు. దిశా పటాని చివరి సారిగా సల్మాన్ ఖాన్ చిత్రం రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ లో కనిపించింది. ఇప్పుడు ఆమె త్వరలో ఏక్తా కపూర్ యొక్క కెటినా మరియు ఏక్ విలన్ రిటర్న్స్ లో కనిపిస్తుంది.

టైగర్ ప్రేమలో

అన్నట్టు బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదా దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న టైగర్ ష్రాఫ్ తో ఈ భామ ప్రేమలో పడింది. ముందు ఈ ఇద్దరూ కలిసి భాగీ 2 అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నాళ్ళ పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించారు. అనేక సందర్భాల్లో ఫోటోలు సైతం బయటకు వచ్చినా వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా ఎప్పుడూ తమ ప్రేమ బంధాన్ని ఒప్పుకోవడం లేదు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here