మరోసారి ఆ విధంగా కలుసుకున్న మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్.. గ్లామర్ డ్రెస్సుల్లో కౌగిలింతలు

0
23

సినిమా ప్రపంచంలో స్టార్స్ గా ఉండే అందరూ బాగానే మాట్లాడతారు గాని మనసుకు దగ్గరగా మాట్లాడేవారు మాత్రం కొందరు మాత్రమే ఉంటారు. అందుకే రంగుల ప్రపంచంలో మంచి స్నేహితులు దొరికితే ఏ మాత్రం మిస్ చేసుకోరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే సెలబ్రెటీలలో మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్ టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల అనంతరం వీరిద్దరూ కాస్త స్పెషల్ గా వంటల ప్రోగ్రాం ద్వారా దర్శనమిచ్చారు.

ఆహా బోజనంబు..

ప్రస్తుతం ఆహా యాప్ యాప్ లో మంచు లక్ష్మి ఆహా బోజనంబు అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ కార్యక్రమంలో ప్రతి స్పెషల్ ఎపిసోడ్ కు ప్రత్యేకంగా ఒక సెలబ్రెటీని తీసుకువస్తున్నారు. ఇక ఈసారి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దించింది. ఇద్దరు కూడా చాలా స్పెషల్ గా కనిపించారు.

మంచి ఫ్రెండ్స్ తో మంచి ఫుడ్

మంచి ఫుడ్ కంటే బెటర్ గా ఉండేది ఏంటి? మంచి ఫ్రెండ్స్ తో మంచి ఫుడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఫొటోలను ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేయగా అవి వైరల్ గా మారాయి. రకుల్ , లక్ష్మీ ఇద్దరు కూడా కౌగిలింతలతో ఆప్యాయంగా ఉన్న ఫొటో కూడా వైరల్ గా మారింది. ఇక వీరు చేసిన వంట హంగామా త్వరలోనే ఆహా యాప్ లో సందడి చేయబోతోంది.

ఎలాంటి పార్టీ ఉన్నా కూడా

మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. అంతే కాకుండా వారి ఫాలోవర్స్ కు కూడా ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా వీరికి సంబంధించిన ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఎలాంటి పార్టీ ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు.

ఆ ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధం

ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈక్వల్ గానే ఒక కాలేజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇక మంచు లక్ష్మి తన ఫ్యామిలీ పార్టీలకు కూడా రకుల్ ను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తుంది. మంచు ఫ్యామిలీతో కూడా రకుల్ కు మంచి అనుబంధం ఉంది. మంచు మనోజ్ తో ఆమె గుంటురోడు అనే సినిమా కూడా చేశారు. ఇక అప్పటి నుంచే మంచు లక్ష్మితో ఆమె క్లోజ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here