మనసుతో పాటు శరీరం వయసు పెరగని వ్యక్తి మహేష్

0
22

ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ యూట్యూబ్ ద్వారా తమ పాత సినిమాలకు సంబంధించిన.. తాము వర్క్ చేసిన స్టార్స్ కు గురించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఎంతో మంది దిగ్గజాలతో వర్క్ చేసిన పరుచూరి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ఎంతో మందికి అది ఒక విద్యలాగా నిలిచి పోతుంది. పరుచూరి వారి పాటలు అంటూ ఎంతో మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ యూట్యూబ్ లో వారి వీడియోలను చూస్తున్నారు. అలాంటి పరుచూరి గోపాల కృష్ణ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుక సంబంధించిన వీడియోను తీసుకు వచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా వీడియో చేయాలనుకున్న కుదరలేదు.. కాస్త ఆలస్యం అయినా ఆయన పుట్టిన రోజుకు వీడియోను తీసుకు వస్తున్నట్లుగా పరుచూరి గోపాల కృష్ణ చెప్పాకొచ్చారు.

ఇక మహేష్ బాబు గురించి పరుచూరి వారు మాట్లాడుతూ… మహేష్ చిన్నప్పటి నుండే మంచి నటుడు. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కృష్ణ మరియు విజయశాంతిలతో మహేష్ బాబు నటించారు. ఆ రోజుల్లో సూపర్ స్టార్ గా కృష్ణ.. లేడీ అమితాబ్ అంటూ విజయశాంతి స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. అలాంటి సమయంలో వారిద్దరు కలిసి నటించిన సినిమాలో మహేష్ నటించి తన మార్క్ ను చూపించాడు. అద్బుతమైన అతడి నటన ప్రతిభకు అదే నిదర్శణం అంటూ పరుచూరి వారు చెప్పుకొచ్చారు.

కృష్ణ గారు నమ్మకంతో మహేష్ బాబు బాధ్యత మాకు అప్పగించిన సమయంలో రాజకుమారుడు సినిమా కథను తయారు చేశాం. ఆ కథకు మహేష్ పూర్తి న్యాయం చేసి నటించాడు. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక అర్జున్ సినిమా విషయంలో జరిగిన పొరపాటును పరుచూరి వారు ప్రస్తావిస్తూ సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లాప్ అయ్యింది అన్నారు. సెట్టింగ్ ను వేయకుండా నేరుగా అక్కడే సినిమా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అంటూ పరుచూరి వారు అన్నారు. చాలా మందికి శరీరంకు వయసు పెరుగుతుంది. కాని మనసుకు మాత్రం వయసు పెరగదు. కాని మహేష్ బాబుకు మాత్రం శరీరం మరియు మనసు రెండ్డింటికి కూడా వయసు పెరగడం లేదు. పదేళ్ల క్రితం ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా మహేష్ అలాగే ఉన్నాడు అంటూ ఆయన అందంపై పరుచూరి వారు ప్రశంసలు కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here