మందుబాబులపై సింగర్ సునీత హాట్ కామెంట్స్

0
18

కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సింగర్ సునీత ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చిస్తోంది. ఇప్పుడున్న భయాలు ఆందోళనలు దూరం చేసేలా అందరితో ముచ్చట్లు పెడుతూ తన గానామృతంతో కొంతసేపైనా బాధితులకు ఉపశమనం కలిగిస్తోంది

తన పాటలతో కొంతమంది అయినా సంతోషంగా ఉంటున్నారంటూ వారి కోసం ప్రతిరోజు కొంత సమయం ప్రేక్షకులకు సునీత కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత తెలంగాణలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ పై స్పందించారు. ఈ లాక్ డౌన్ లో వైన్ షాపుల వద్ద ఎగబడుతున్న మందుబాబులపై సునీత షాకింగ్ కామెంట్స్ చేశారు.

సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడిన సునీత ‘తాను కూడా లాక్ డౌన్ కోసం ఎదురుచూస్తున్నానని’ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితుల్లో కొంత మేర మార్పు వస్తుందని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ అనడంతో అందరూ సరుకులు కొనడానికి షాపుల ముందు క్యూ కట్టారని.. రెండు రోజుల తర్వాత ఈ రద్దీ ఉండకపోవచ్చని అనుకుంటున్నానని సునీత అన్నారు.

ఇక లాక్ డౌన్ అనగానే కిరాణా సామగ్రి  కోసం జనం షాపుల ముందు క్యూ కడుతారని అనుకున్నారని.. కానీ మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదని సునీత షాకింగ్ కామెంట్ చేశారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశమని సునీత వాపోయింది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాలని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here