బోయ్స్ కంటికి అందుకే నిదుర కరువు క్యూటీ

0
29

అనుపమ పరమేశ్వరన్ 2015 లో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఐదున్నరేళ్లయ్యింది. ఈ తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుత అవకాశాలు అందుకుంది. నటిగా నిరూపించుకుంది. అంతకుమించి గొప్ప అభిమానుల్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాల్లో అనుపమకు పడిచచ్చే పిచ్చి వీరాభిమానులున్నారు.

అందానికి అందం.. చక్కని నటనా నైపుణ్యంతో మురిపించే ఈ క్యూట్ బ్యూటీ …కర్లీ హెయిర్ స్మైలీ లుక్ తో కవ్వించే తీరు మతి చెడగొడుతుంది. అనుపమ చాలా క్యాజువల్ గా కనిపించినా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకుపోతుంది అనడానికి ఇదిగో ఈ క్యాజువల్ లుక్ ఎగ్జాంపుల్.

బ్లాక్ టాప్ .. వైట్ ఎన్ 95 మాస్క్ ని ధరించిన అనుపమ అలా రెడ్ రోజ్ ని ఫిక్స్ చేసిన తీరు లబ్ డబ్ ని పెంచేస్తోంది. ఆ అందమైన కర్లీ హెయిర్ తన అందాన్ని ఆకర్షణను పదింతలు పెంచిందంటే అతిశయోక్తి కాదు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే… 18 పేజెస్ లాంటి క్రేజీ లవ్ స్టోరీలో నిఖిల్ సరసన నటిస్తోంది. తమిళంలో నిన్ను కోరి రీమేక్ లో అధర్వ సరసన నాయికగా నటిస్తోంది. ప్రేమకథా చిత్రాలకు అనుపమ క్యూట్ లుక్స్ పర్ఫెక్ట్ యాప్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న రెండు సినిమాలు తనకు ఎలాంటి బ్రేక్ ని ఇస్తాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here