బుల్లి బట్టల్లో మంచు లక్ష్మీ రచ్చ: తొలిసారి అలా కనిపించిన బ్యూటీ.. షాకిచ్చేలా అందాల విందు

0
27

మంచు లక్ష్మీ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈమె చాలా ఏళ్లుగా సినీ రంగంలో తనదైన గుర్తింపును అందుకుంది. పేరుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తే అయినప్పటికీ.. స్వతహాగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుందామె. అదే సమయంలో పలు సినిమాలు, టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు చేరువ అయింది. ఇక, సోషల్ మీడియా పుణ్యమా అని మరింతగా ఫేమస్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మీ బుల్లి బట్టల్లో దిగిన కొన్ని గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

తండ్రి బాటలోనే సినిమాల్లోకి ప్రవేశం

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం.. ఆయన సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తుండడమే. అలాగే, తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పుడో సినిమా హీరోలుగా ప్రయాణాన్ని మొదలు పెట్టగా.. వాళ్లతో పాటే మంచు లక్ష్మీ కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఒకేసారి మూడింట్లో.. అదిరిపోయేలా

మంచు లక్ష్మీ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అవడానికి ముందే ‘ద ఓడ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత ‘డియర్ ఎయిర్’ అనే మూవీలోనూ నటించిందామె. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ‘లక్ష్మీ టాక్ షో’ అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకేసారి మూడు విధాలుగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.

తక్కువ చేసినా.. ఎక్కువ గుర్తింపుతో

‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో మంచు లక్ష్మి తెలుగులో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును అందుకుందామె.

అక్కడ మాత్రం లక్ష్మీ ఎప్పుడు బిజీనే

నటిగా, నిర్మాతగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ ఫేమస్ అయిపోయింది.

బుల్లి బట్టల్లో మంచు లక్ష్మీ రచ్చ రచ్చ

మంచు లక్ష్మీ విదేశాల్లో ఉండి వచ్చిన విషయం తెలిసిందే. అందుకే అక్కడి కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. ఈ కారణంగానే ఆమె పలుమార్లు విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మంచు లక్ష్మీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి బట్టలు ధరించి ఉంది. దీంతో ఈ స్టార్ డాటర్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

తొలిసారి అలా కనిపించిన మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ గ్లామర్ షోకు దూరంగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు చిన్న స్కర్ట్ ధరించిన పిక్స్‌ను వదలడంతో నెటిజన్లతో పాటు మంచు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక, ఈ ఫొటోల్లో ఆమె అందాలు కనువిందు కూడా చేస్తున్నాయి. దీంతో వాటికి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా మంచు లక్ష్మీ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ ఫొటోలు వైరల్ అయిపోయాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here