బుచ్చి బాబు షాకింగ్ నిర్ణయం.. ఎన్టీఆర్ స్పందన ఏంటో మరి?

0
18

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ దర్శకుడు తన రెండవ సినిమాకే ఎన్టీఆర్ తో వర్క్ చేసే అవకాశంను దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ స్వయంగా పిలిచి కథను సిద్దం చేయమని చెప్పాడని.. బుచ్చిబాబు రెండవ సినిమా ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థలో ఉండబోతుంది అంటూ ఆమద్య ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో బుచ్చి బాబు రెండవ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కాని ప్రస్తుతం బుచ్చిబాబు కొత్త హీరోతో సినిమాను చేసేందుకు మరో కథను సిద్దం చేస్తున్నాడనే ప్రచారం మొదలు అయ్యింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆ సినిమా వర్కింగ్ డేస్ అంతకంతకు పెరిగి పోతున్నాయి. ఎప్పటి వరకు ఆ సినిమా పూర్తి అవుతుందో క్లారిటీ లేదు. జక్కన్న దర్శకత్వంలో మూవీ పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ ఓకే చెప్పడం.. అది అధికారికంగా ప్రకటన రావడం కూడా జరిగింది. కొరటాల శివ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు పూర్తి అయ్యేప్పటికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేని పరిస్థితి.

ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లు అయినా వెయిట్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో బుచ్చి బాబు ఆ లోపు ఒక చిన్న సినిమాను చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓకే చెప్పిన తర్వాత మరో సినిమా ను చేస్తానంటూ బుచ్చిబాబు తీసుకున్న నిర్ణయంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి బుచ్చి బాబు తీసుకున్న నిర్ణయం విషయంలో ఎన్టీఆర్ స్పందన ఏంటీ అనేది కూడా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here