బీజేపీ నేత విష్ణుపై.. నటుడు సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు!

0
43

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై సినీ హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలుత సిద్ధార్థ్ పై విష్ణువర్థన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థ్. ‘నీకు సిగ్గుండాలి’ అంటూ తీవ్ర పదజాలంతో సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

కరోనా నియంత్రణలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రధాని మోడీ దారుణంగా విఫలమయ్యారని కొన్ని రోజులుగా సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా తయారైందని అయినా.. పట్టించుకోవట్లదని ఆరోపించారు. దీంతో.. సిద్ధార్థ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సిద్ధార్థ్ పై కామెంట్ చేశారు. సిద్ధార్థ్ నటిస్తున్న సినిమాలకు దావూద్ ఇబ్రహీం నుంచి డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. దీంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థ్.

‘‘లేదు రా. అతడు (దావూద్) నా TDS కట్టేందుకు రెడీగా లేడు. నేను పర్ఫెక్ట్ సిటిజన్ టాక్స్ పేయర్ ను కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సిద్ధార్థ్. దీంతో.. సోషల్ మీడియాలో బీజేపీ వర్సెస్ సిద్ధార్థ్ వార్ మరోసారి మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here