బీజేపీ ఎంపీని కసబ్ తో పోల్చిన ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్..!

0
44

‘బొమ్మరిల్లు’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో సిద్ధార్థ్.. తన వాయిస్ వినిపించి జనాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ మధ్య అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్పు సిద్దార్ధ్ – బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అలానే కొందరు సిద్దార్థ్ కుటుంబ సభ్యులను ఫోన్ చేసి దూషించడం.. రేప్ చేస్తామని చంపేస్తామని బెదిరించడం వంటివి కూడా జరిగాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గని సిద్దార్థ్ తాజాగా బీజేపీ ఎంపీ ని తీవ్రవాది అజ్మల్ కసబ్ తో పోల్చుతూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

జాతీయ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల హాస్పిటల్స్ బెడ్స్ కు సంబంధించిన స్కామ్ ని బయటపెట్టారు. అయితే దీంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ ఇదంతా చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తేజస్వి పై హీరో సిద్ధార్థ్ తీవ్రంగా స్పందిస్తూ.. ఎంపి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని ట్వీట్ చేశాడు. ”తేజస్వి సూర్య చాలా ప్రమాదకరం మరియు అజ్మల్ కసాబ్ కంటే ఒక డికేడ్ పెద్దవాడు. ఈ ట్వీట్ ను సేవ్ చేసుకోండి. దురదృష్టవశాత్తు ఇది బాగా పెద్దది అవుతుంది” అని సిద్ధార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు..

ఇకపోతే హీరో సిద్ధార్థ్ ఇటీవల తన మొబైల్ నంబర్ ను బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ లీక్ చేసిందని.. దీనివల్ల తనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి దూషించడం రేప్ చేస్తామని చంపేస్తామని బెదిరించడం చేస్తున్నారని ట్వీట్ చేశారు. 24 గంటల్లో 500కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. అన్ని నెంబర్లు రికార్డ్ చేసి పోలీసులకు ఇవ్వనున్నట్లుగా తెలిపాడు. అంతేకాదు ఇలాంటివి తను నోరు మూయించలేవని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ – హోంమంత్రి అమిత్ షా లను ట్యాగ్ చేశాడు సిద్ధార్థ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here