‘బిగ్ బాస్-5’ హోస్ట్ పై సస్పెన్స్ కు తెరదించిన రానా..!

0
8

ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రియాలిటీ షో తెలుగు ”బిగ్ బాస్”. తెలుగులోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్.. ఇప్పటికి నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ‘బిగ్ బాస్-5’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ ను నడిపించిన ‘స్టార్ మా’ వారు.. ఐదో సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజన్-5 కు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్-3 & 4 సీజన్లను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్ 5’ కి అందుబాటులో ఉండటం లేదని.. రానా దగ్గుబాటి రాబోయే సీజన్ కు వ్యాఖ్యాతగా ఉంటారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్-5’ తెలుగు హోస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు రానా తెరదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బిగ్ బాస్-5’ తెలుగు హోస్ట్ గా చేయనున్నారనే వార్తలకు చెక్ పెట్టారు. తాను ‘బిగ్ బాస్’ షో కు హోస్ట్ గా చేయట్లేదని.. ప్రస్తుతానికి సినిమాలు – ఓటీటీ సిరీస్ లలో చేయటం సంతోషంగా ఉందని రానా పేర్కొన్నారు.

రానా ‘బిగ్ బాస్’ షో కు వ్యాఖ్యాతగా చేయడం లేదని ప్రకటించడంతో.. 5వ సీజన్ కు ఎవరు హోస్ట్ చేస్తారనేది మళ్ళీ ప్రశ్నార్థకంగా మారింది. కాగా గత నాలుగు సీజన్స్ మంచి ప్రజాదరణ తెచ్చుకోవడంతో.. ‘బిగ్ బాస్ 5’ పై అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే నిర్వాహకులు కొత్త సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వస్తుండటంతో ‘బిగ్ బాస్’ తదుపరి సీజన్ ను సెప్టెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ‘బిగ్ బాస్ 4’ కూడా గతేడాది సెప్టెంబర్ లోనే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here