బిగ్ బాస్‌ షోలోనే హైలైట్ సీన్ ఇది: ఊహించని పని చేసిన అఖిల్.. బాధతో కన్నీటి పర్యంతం!

0
46

బిగ్ బాస్.. నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెరపై చక్రం తిప్పుతోన్న షో ఇది. హిందీతో సహా చాలా భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. మన దగ్గర మాత్రమే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకుంటోంది. గత వాటి మాదిరిగానే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇక, ఈ సీజన్ తుది దశకు చేరుకోవడంతో మరింత రంజుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఓ హైలైట్ సీన్ జరిగింది. దానికి కారణం మరెవరో కాదు.. అఖిల్ సార్థక్. బాధతో అతడు చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే…

వాళ్లిద్దరి గొడవతో రక్తి కట్టిన షో

బిగ్ బాస్ షోలో గ్రూపులు ఏర్పడడం సర్వసాధారణమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జరిగిన అన్ని సీజన్లలోనూ ఇదే కనిపించింది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో అయితే అఖిల్ సార్థక్ – అభిజీత్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. మోనాల్ కారణంగా మొదలైన ఈ గొడవ.. షో చివరి దశకు చేరుకున్నంత వరకూ సాగుతూనే ఉంది.

కలిసేందుకు ముందుకొచ్చి అభి

అఖిల్ సార్థక్‌తో గొడవ విషయంలో అభిజీత్ తరచూ వెనక్కి తగ్గుతూనే ఉన్నాడు. ఈ విషయం ఎన్నోసార్లు బయటకు వచ్చింది. అంతేకాదు, బిగ్ బాస్‌ షోలోకి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన సమయంలోనూ అభి.. తన తప్పుకు మన్నించాలని వాళ్లను కోరాడు. దీనికి అఖిల్ ఫ్యామిలీ మెంబర్స్ పాజిటివ్‌గా స్పందించి ‘గేమ్ గేమ్‌లా ఆడుతున్నారు. పర్వాలేదు’ అని చెప్పారు.

నామినేషన్ టాస్కులో చెప్పాడు

అఖిల్ – అభిజీత్ మధ్య నామినేషన్స్ సమయంలోనే గొడవలు జరిగాయి. ఇవి ఎంతగానో హైలైట్ అవడంతో నాగార్జున కూడా వీళ్లిద్దరిపై సీరియస్ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం జరిగిన నామినేషన్ టాస్కులో అభిజీత్ మరోసారి స్టాండ్ తీసుకున్నాడు. ఇకపై మనమిద్దరం కలిసుండాలని, అందుకే నామినేట్ చేయడం లేదని అఖిల్‌తో చెప్పాడు.

వాళ్లిద్దరి కోసం కూర్చునే ఉండి

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ జరుగుతోంది. ఇందులో గెలిచిన ఒక కంటెస్టెంట్ నేరుగా ఫినాలేలో అడుగు పెట్టబోతున్నాడు. ఇందులో చివరి రౌండ్ అఖిల్ సార్థక్ – సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య జరుగుతోంది. దీనికి అభిజీత్ సంచాలకుడిగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరికీ సపర్యలు చేస్తున్నాడు. దీంతో అఖిల్‌తో మాటలు కూడా కలిశాయి.

బిగ్ బాస్‌ షోలోనే హైలైట్ సీన్

‘రేస్ టు ఫినాలే’ మెడల్ అఖిల్ సార్థక్ గెలుచుకున్నాడని రెండు రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో అసలు అఖిల్ ఎలా గెలిచాడు.? సోహెల్ ఉయ్యాల మీద నుంచి ఎందుకు దిగిపోయాడు? సంచాలకుడిగా అభిజీత్ ఎలా పని చేశాడు? అనేవి తెలియాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ మొత్తానికే హైలైట్ సీన్ ఒకటి జరిగింది. అది శుక్రవారం ఎపిసోడ్‌లో చూపించనున్నారు.

ఊహించని పని చేసిన అఖిల్

శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో సోహెల్ ఏడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత అఖిల్ కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఉయ్యాల నుంచి దిగిపోయి వచ్చారు. అప్పుడు ఇద్దరినీ సంచాలకుడిగా ఉన్న అభిజీత్ గట్టిగా హగ్ చేసుకుని బాగా బాధపడ్డాడు. ఎప్పుడూ కొట్టుకునే వాళ్లు ఇలా కలవడం షోకే హైలైట్‌గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here