బిగ్‌బాస్ హెచ్చరించినా తీరు మారని కంటెస్టెంట్లు.. మళ్ళీ అదే తప్పు, రేటింగ్‌కే దిక్కులేదంటే..

0
30

బిగ్‌బాస్ హౌజ్ లో పోరాడి నిలవడం ఎంత ముఖ్యమో అలాగే ఇంటి నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. క్రమశిక్షణ తప్పినా కూడా పోరాడే విధంగానే ఉండాలి. మానసిక హింస ఎంత చేసినా శారీరక హింస చేయరాదు అనేది అందరికి తెలిసిందే. బిగ్ బాస్ లో అన్ని చేయాలి కాని కాలం కలిసి రాకపోతే ఏం చేయకపోయినా ఎఫెక్ట్ తప్పదు. ఇక తెలుగు షోలో తెలుగు మాట్లాడకపోవడం ఈ మధ్య ఎక్కువయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి.

కాస్త ఓవర్ చేస్తున్నారా..?

సాధారణంగా ఆడియెన్స్ కి తెలిసిన కంటెస్టెంట్స్ నే హౌజ్ లోకి పంపిస్తూ ఉంటారు నిర్వాహకులు. పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలని చెబుతూ ఉంటారు బిగ్ బాస్. ఇక ఇంటి నియమల్లో అది ప్రధానమైన పాయింట్. కానీ షోలో ప్రతి రోజు కొందరు కంటెస్టెంట్స్ కాస్త ఓవర్ గా పరబాషలో మాట్లాడడం ఆడియెన్స్ కి నచ్చడం లేదు.

కాస్త ఓవర్ చేస్తున్నారా..?

సాధారణంగా ఆడియెన్స్ కి తెలిసిన కంటెస్టెంట్స్ నే హౌజ్ లోకి పంపిస్తూ ఉంటారు నిర్వాహకులు. పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలని చెబుతూ ఉంటారు బిగ్ బాస్. ఇక ఇంటి నియమల్లో అది ప్రధానమైన పాయింట్. కానీ షోలో ప్రతి రోజు కొందరు కంటెస్టెంట్స్ కాస్త ఓవర్ గా పరబాషలో మాట్లాడడం ఆడియెన్స్ కి నచ్చడం లేదు.

హిందీ, ఇంగ్లీష్.. మిక్స్ చేసి..

మోనాల్ నార్త్ అమ్మాయే అయినా ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉంది. తెలుగులో మాట్లాడడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది గాని మళ్ళీ మర్చిపోయి హిందీ లేదా ఇంగ్లీష్ లోకి వెళ్లిపోతోంది. ఇదివరకే ఒకసారి ఆమెకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ సోమవారం ఎలిమినేషన్ లో హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి గట్టిగానే వాదించింది.

హారిక కూడా అదే తప్పు చేస్తోంది

హారికకు ఏమైందో ఏమో గాని అచ్చ తెలంగాణ బాషతోనే క్రేజ్ అందుకున్నప్పటికి ఈ మధ్య కాస్త ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేస్తోంది. మోనాల్ తెలుగు అంతగా మాట్లాడకపోయినా కూడా ఆమెకు బాగానే అర్ధమవుతుంది. కానీ హారిక ఇంగ్లీష్ లోనే ఆమెను నామినేట్ చేయడం ఒక సాధారణ ఆడియెన్స్ కి ఎలా అర్థమవుతుందో ఆమెకే తెలియాలి. ఇప్పుడనే కాదు గతంలో చాలా సార్లు హారిక ఇంగ్లీష్ లో కోపాన్ని బయటపెట్టింది.

ఓ వైపు రేటింగ్స్ కోసం కష్టపడుతుంటే.

మ్ టీవీ ఆడియెన్స్ లో ఎక్కువగా తెలుగు తెలిసిన వారే ఉంటారు. వారి సపోర్ట్ ఉంటేనే బిగ్ బాస్ షో హిట్టవుతుంది. కానీ తెలుగులో మాట్లాడకపోతే చూసే ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది. అసలే రేటింగ్ లేక నిర్వాహకులు టాస్కులతో డోస్ పెంచి నాగార్జునకు కూడా ఎక్కువ పనే చెబుతున్నారు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్ లో రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది. మరి ఈ సారి బిగ్ బాస్ వీరిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఓ వైపు రేటింగ్స్ కోసం కష్టపడుతుంటే. మ్

టీవీ ఆడియెన్స్ లో ఎక్కువగా తెలుగు తెలిసిన వారే ఉంటారు. వారి సపోర్ట్ ఉంటేనే బిగ్ బాస్ షో హిట్టవుతుంది. కానీ తెలుగులో మాట్లాడకపోతే చూసే ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది. అసలే రేటింగ్ లేక నిర్వాహకులు టాస్కులతో డోస్ పెంచి నాగార్జునకు కూడా ఎక్కువ పనే చెబుతున్నారు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్ లో రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది. మరి ఈ సారి బిగ్ బాస్ వీరిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here