బికినీలో రెచ్చిపోయిన ఇలియానా: చాలా రోజుల తర్వాత ఘాటుగా కనిపించిన బ్యూటీ

0
8

చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించింది గోవా బ్యూటీ ఇలియానా. నాజూకు నడుముతో తెలుగు కుర్రాళ్ల కలల రాణిగా మారిన ఈ భామ.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకున్నా.. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా తన ఓ హాట్ బికినీ సెల్ఫీని షేర్ చేసింది.

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే ఇలియానా ‘దేవదాసు’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది.

తెలుగులోకి రీఎంట్రీ… మళ్లీ మాయం

తెలుగులో వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇలియానా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత హిందీలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా దారుణ పరాజయం పాలవడంతో తెలుగు పరిశ్రమలో కనిపించకుండా వెళ్లిపోయింది.

విదేశీయుడితో లవ్.. కొన్నేళ్లకు బ్రేకప్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నేళ్ల తర్వాత ఇలియానా అతడికి బ్రేకప్ చెప్పేసింది.

బ్రేకప్ తర్వాత డిప్రెషన్… ఆఫర్ల కోసం

ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తూ బిజీగా గడిపింది. దీంతో మునుపటి రూపానికి వచ్చింది. ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తోంది.

ఎప్పుడూ అక్కడే ఉంటూ రచ్చ చేస్తూ

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు.

హాట్ బికినీ సెల్ఫీతో ఇలియానా రచ్చ

సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో గోవా బీచ్‌లో దిగిన హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. అంతేకాదు, బికినీ ధరించి ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here