బాలీవుడ్ దర్శకనిర్మాతలతో చెర్రీ బిగ్ డీల్స్.. అందుకేనా ముంబై ఇల్లు!?

0
14

రామ్ చరణ్ -ఉపాసన దంపతులు నూతన గృహప్రవేశం చేశారంటూ ఇటీవల ప్రచారమైంది. నిజానికి జూబ్లీహిల్స్ లో ఇప్పటికే ఈ జంటకు ఇంద్రభవనం లాంటి ఖరీదైన భవంతి ఉంది. దీనికోసం సుమారు 60 కోట్లు పైగా ఖర్చు చేశారని కూడా అప్పట్లో ప్రచారమైంది. ఇంతలోనే ఈ నూతన గృహ ప్రవేశం ఏమిటో? అంటూ కొందరు ఆశ్చర్యపోయారు.

అయితే ఇది నిజమే. రామ్ చరణ్ కొత్త అపార్ట్ మెంట్ కొన్నారు. అయితే అది హైదరాబాద్ లో కాదు. ముంబైలో ఈ కొత్త ఇల్లు (బంగ్లా) కొన్నారు. ఈ ఇంటిలోకే చరణ్ -ఉపసన జంట ఇంతకుముందే పూజా కార్యక్రమం నిర్వహించారు.

నిజానికి ముంబైలో రకరకాల కమిట్ మెంట్లలో భాగంగా చాలాకాలంగా ఇల్లు కొనాలని చూస్తున్నా ఇప్పటివరకూ కుదరలేదు. చివరికి అతని కోరిక ఇటీవల నెరవేరింది. చరణ్ ఇటీవల ముంబై శివారు ప్రాంతమైన ఖర్ పరిసరాల్లో బీచ్ ముఖంగా ఉన్న బంగ్లాను తీసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఇంటికి హౌస్ వార్మింగ్ వేడుకను నిర్వహించారని తెలిసింది. ఇటీవల ఆ ఇంటిని చెర్రీ-ఉపాసన సందర్శించారు. మరోసారి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారట.

అయితే ఇంత సడెన్ గా అక్కడ ఇల్లు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అన్నది ఆరా తీస్తే.. రామ్ చరణ్ ముంబైకి వెళ్ళినప్పుడల్లా బస కోసం ఒక స్టార్ హోటల్ లో ఉండాల్సి వచ్చేది. కానీ అది అతడికి ఇష్టం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలతో చర్చలు జరుపుతున్నందున అతను అక్కడే ఉండటానికి బంగ్లా కొనాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతోంది. ఈ మూవీ హిందీ ప్రమోషన్స్ కి కూడా చరణ్ ముంబైలో ఉండాల్సి ఉంటుంది. తదుపరి శంకర్ కాంబినేషన్ లో ఆర్సీ 15 కోసం అతడు ముంబై వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఇక సొంతింటిని రెడీ చేసుకున్నారన్నమాట.

బీచ్ కి అభిముఖంగా ఉండే బంగ్లా కొనాలన్న ఆలోచన చరణ్ అభిరుచికి దగ్గరైనది. చరణ్ ఈ భవంతిని చాలా ప్రియమైనదిగా భావిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here