బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ‘మాధురీ దీక్షిత్

0
22

బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే మాధురీ దీక్షిత్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 1990 దశకంలో మాధురీ బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజిలో ఉర్రూతలు ఊగించిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు మాధురీని మరిపించే హీరోయిన్స్ ఎవరు రాలేదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో 1994 నాటికే మాధురి సూపర్ స్టార్.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ తో వరుసగా జోరులో ఉంది. అప్పుడు ఆమె వయసు 27ఏళ్లు. అప్పటికే తేజాబ్ రామ్ లఖన్ త్రిదేవ్ పరిందా దిల్ సాజన్ బెటా ఖల్నాయక్ వంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకుంది.

నిజానికి 90వ దశకంలో మాధురి బాక్సాఫీస్ గ్లామర్ క్వీన్. అప్పట్లో ఆమె తాకినవన్నీ బంగారంగా అయిపోయేవి. రాజ్ శ్రీ ప్రొడక్షన్స్ లో 17ఏళ్లకే మాధురి అబోద్(1984) అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫలితం పక్కనపెడితే.. ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది మాధురీ. అలా కొన్ని సినిమాలు చేసాక తేజాబ్ సినిమా చేసింది. అంతే ఒక్కసారిగా మాధురీ హాట్ అందాలతో ‘ఏక్ దో తీన్..’ అంటూ ఫిదా చేసేసింది. ఆ తర్వాత సాజన్ – బేటా ఇలా వరుసగా హిట్లను చవిచూసింది మాధురీ.

అనంతరం 2000లో మాధురి మిలీనియం నటిగా బిరుదు పొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మిలీనియం వెర్షన్ మాధురీని అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయనటిగా పేర్కొనడం విశేషం. మాధురి దీక్షిత్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డాక్టర్ శ్రీరామ్ ను 1999లో వివాహం చేసుకుంది. భర్తతో యూఎస్ వెళ్లిపోయింది. మాధురీ దంపతులకు ఇద్దరు కొడుకులు అరిన్ – ర్యాన్. ఇదిలా ఉండగా.. ఈరోజు మే15 అంటే మోస్ట్ ఫేవరేట్ మాధురీ దీక్షిత్ పుట్టినరోజు. ఈరోజుతో మాధురీ 54వ పడిలో అడుగుపెడుతోంది. ఐదు పదుల వయసులో కూడా మాధురీ గ్లామర్ తో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది.

మాధురి దీక్షిత్ పద్మశ్రీ గ్రహీత. ఆమె ఇప్పటివరకు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా 100 సెలబ్రిటీ జాబితాలో ఏడుసార్లు చోటు దక్కించుకుంది. మాధురీకి పుట్టినరోజు శుభాకాంక్షలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here